కరీంనగర్‌కు చెందిన వాణినికేతన్ విద్యాసంస్థల అధినేత, ప్రముఖ విద్యావేత్త అయోధ్య రామారావు కన్నుమూశారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ ఆయన మృతదేహానికి నివాళులర్పించి.. రామారావు కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తాను, మంత్రి హరీశ్ రావు రామారావు స్టూడెంట్లమన్నారు.

తామిద్దిరిని ఆయన సొంత కొడుకులా చూసుకున్నారని, ఎప్పుడూ ఫీజులు కూడా అడిగేవారు కాదని గంగుల గుర్తు చేసుకున్నారు. విలువలతో కూడిన విద్యతో పాటు జీవిత పాఠాలను కూడా తమకు నేర్పారన్నారు. అయోధ్య రామారావు విద్యారంగానికి చేసిన సేవలు మరవలేనివని గంగుల కమలాకర్ తెలిపారు.