Asianet News TeluguAsianet News Telugu

విషాదం... విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యానికి తాతా, మనవరాలు మృతి

జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌ తగిలి తాత, మనవరాలు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా, ఓ మూగజీవి కూడా మృత్యువాత పడింది. 

two people death with current shock in  jagitial
Author
Jagtial, First Published Jul 23, 2020, 10:21 AM IST

జగిత్యాల: జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌ తగిలి తాత, మనవరాలు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా, ఓ మూగజీవి కూడా మృత్యువాత పడింది. ఈ ఘటన జిల్లాలోని కోరుట్ల పట్టణంలో గురువారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. 

 వివరాల్లోకి వెళితే.. కోరుట్ల మునిసిపాలిటీలో విలీన గ్రామమైన యేఖిన్ పూర్‌లో రాత్రి కురిసిన వర్షానికి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అది గమనించకుండా తెల్లవారు జామున ఇంట్లోంచి బయటకు వచ్చిన అందుగుల మల్లయ్య (65), అందుగుల మౌనిక (17)లకు విద్యుత్ తీగ తగలడంతో షాక్ కు గురయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. 

read more  మరో తెరాస ఎమ్మెల్యేకి కరోనా, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స

సరిగ్గా మృతుల ఇంటి ఎదుటే 11 కెవీ లైన్ విద్యుత్ తీగలు తెగిపడి కనిపించాయి. వీరితో పాటే కరెంట్ షాక్‌తో ఓ మూగజీవి కూడా చనిపోయింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

ఒకే కుటుంబంలో ఇద్దరు మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి  తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios