మరో నాలుగేళ్లు ఇక రాజకీయాల్లేవు...: మంత్రి గంగుల
కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడంతో మంత్రి గంగుల ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు.
కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. సోమవారం వెలువడిన కార్పోరేషన్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక డివిజన్లలో విజయాన్ని సాధించింది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సంబరాల్లో మంత్రి గంగుల కమలాకర్ కూడా పాల్గొని స్వయంగా టపాసులు కాలుస్తూ కార్యకర్తలో విజయానందాన్ని పంచుకున్నారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఇంత గొప్ప విజయాన్ని అందించిన కరీంనగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే గెలుపొందిని అభ్యర్ధులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.
బండి సంజయ్ కు షాక్... కరీంనగర్ లో పాగావేసిన టీఆర్ఎస్
కాంగ్రెస్, బీజేపీ కలిసి టీఆర్ఎస్ ను ఓడించాలని చూసాయన్నారు. అయినప్పటికి వారి ఆటలు సాగలేవని... కాంగ్రెస్ తో చేతులు కలపడం వల్లే బీజేపీ 13 డివిజన్లలో గెలిచిందన్నారు. చరిత్రలో మొదటిసారి కాంగ్రెస్ సున్నాకే పరిమితమైందన్నారు. గెలిచిన ఇండిపెండెంట్లలో టీఆర్ఎస్ రెబల్స్ అభ్యర్థులే ఆరుగురు ఉన్నారని తెలిపారు.
సీఎం కేసీఆర్ పాలన తీరు, ప్రభుత్వ పని తీరు నచ్చి ప్రజలు తమను గెలిపించారని అన్నారు. ఇక ప్రజలకోసం రేపటి నుంచే పని చేస్తామని...2023 లక్ష్యంతో తమ పనులు వుంటాయన్నారు.
గత పార్లమెంట్ ఎన్నాకల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం ఇప్పుడు తగ్గిపోయిందని అన్నారు. ఎవరి సపోర్టు లేకుండా టీఆర్ఎస్ మేయర్ స్థానాన్ని గెలిచిందన్నారు. భావోద్వేగాలను రెచ్చగొట్టడం వల్లే కొన్ని ఓట్లు బీజేపీ తీసుకుందన్నారు.
read more మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి షాక్: ఆధిపత్య పోరుతోనే అనర్థమా..?
ఇప్పటికు అన్ని రకాల ఎన్నికలు ముగిశాయి కాబట్టి మరో నాలుగేళ్ళ రాజకీయాల గురించి మాట్లాడబోనని వెల్లడించారు. తమ బాస్ కేసీఆర్ సీల్డ్ కవర్ లో ఎవరి పేరు పంపిస్తే వారే మేయర్ అవుతారని స్పష్టం చేశారు. ఇండిపెండెంట్లు టీఆర్ఎస్ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని... మేయర్, డిప్యూటీ మేయర్ రెండూ టీఆర్ఎస్ పార్టీవాళ్లే అవుతారని మంత్రి గంగుల స్పష్టం చేశారు.