మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని టిఏన్జీఓల సంఘం ఆధ్వర్యంలో గాంధీ పటమునకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టిఏన్జీఓ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ స్వాతంత్యోద్యమం లో గాంధీ సేవలు మరువలేనివని కొనియాడారు. గాంధీ కలలు కన్న భారత దేశం రావాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టిఏన్జీఓ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మడిపేల్లి కాళిచరణ్ గౌడ్, కోశాధికారి వేముల రవీందర్, కేంద్ర సంఘం నాయకులు నాగుల నరసింహస్వామి ,ప్రభాకర్ రెడ్డి, అర్బన్ అధ్యక్షుడు సర్దార్ హర్మీందర్ సింగ్, కార్యదర్శి నేరేళ్ళ కిషన్ , రూరల్ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి , కార్యదర్శి రాజేష్ భరద్వాజ, తిమ్మాపుర్ అధ్యక్షుడు మామిడి రమేష్, జిల్లా నాయకులు అమరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రమేష్ గౌడ్, అశోక్ కుమార్, ప్రసాద్ రెడ్డి, రాజేశ్వరరావు, మహిళా నాయకులు శ్రీమతి శారదా శైలజ తదితరులు పాల్గొన్నారు