Asianet News TeluguAsianet News Telugu

సెక్స్ రాకెట్ గట్టు రట్టు: పట్టుబడిన యువతి సహా నిర్వాహకులు

కరీంనగర్ పోలీసులు వ్యభిచార గృహాల గుట్టును రట్టు చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న గృహాలపై దాడి చేసి ఓ యువతి సహా నిర్వాహకులను, విటులను పట్టుకున్నారు. సీపీ కమలాసన్ రెడ్డి వివరాలను అందించారు.

Telangana: Sex rocket busted in Karimanagar
Author
Karimnagar, First Published Nov 18, 2019, 7:22 AM IST

కరీంనగర్:  కరీంనగర్ లో వ్యభిచార గృహలపై టాస్క్ ఫోర్స్, 2 టౌన్ పోలిసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. విద్యానగర్ లో  గల ఇంట్లో  వ్యభిచారం నడిపిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి  నిర్వాకులను, యువతిని, విటులను అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో బయటి నుంచి యువతులను తీసుకొని వచ్చి వ్యభిచారం నడిపిస్తున్నారన్న సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ , స్థానిక పోలీసులు సంయుక్తంగా నిఘా పెట్టారు.  వ్యభిచారం నడుస్తుందన్న పక్కా సమాచారం రావడంతో దాడులు నిర్వహించారు. 

విటులు సిరిసిల్లకు చెందిన బీమాంటి నరేష్, కరీంనగర్ లోని మంకమ్మతోటకు చెందిన కుకట్ల సంజీవ్ అనే విటులు పోలీసులకు చిక్కారు. వ్యభిచారం నిర్వహిస్తున్న సిరిసిల్లకు చెందిన గారిపెల్లి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని సదరన్ హోమ్ కి పంపించారు. వీరు మొబైల్ లో అమ్మాయిలను, బుక్ చేసుకొని వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు..నిర్వాహకులు అమ్మాయిలను పక్క జిల్లాల నుoడి తీసుకుని వచ్చి వారిని వ్యభిచారాన్ని నిర్మహిస్తున్నారు, 

కరీంనగర్ లో వ్యభిచారం నడుస్తున్న అన్ని ఇళ్లపై టాస్క్ ఫోర్స్ నిఘా ఉందని, ఇప్పటికైనా నిర్వాహకులు తమ అక్రమ కార్యకలాపాలను ఆపాలని,  నిర్వాహకుల పైన  పీడీ యాక్టు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. సాదారణ జీవితం గడిపే వారికీ మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ కానీ నేరాలకు పాల్పడే వారికీ ,చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికీ కాదు అని అన్నారు .

ప్రజా శాంతికి భంగం కలిగిస్తూ వారి స్వేచ్ఛా భంగం కలిగేంచే వారు ఏవారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ప్రజల భద్రతే తెలంగాణా పోలీసు లక్ష్యం అందరూ సురక్షితంగా ఉండాలని పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి చెప్పారు. 

వ్యభిచారం నిర్వహిస్తున్న గృహాలపై దాడిలో సిఐలు  ఆర్ ప్రకాష్, కె శశిధర్ రెడ్డి, సిహెచ్. దేవా రెడ్డి, ఎస్ఐలు నరేష్, వంశీ  టూ టౌన్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది  పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios