జగిత్యాల: తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం  చేసుకుంది. ధర్మపురి మున్సిపాలిటీ లో 1,2,4,6,8,10,13,15 వార్డులలో టీఆర్ఎస్ విజయం సాధించింది.  ధర్మపురి మున్సిపాలిటీలో 3, 5, 7, 9, 11, 12, 14 వార్డులలో కాంగ్రెస్ విజయం సాధించిదంి.

కొత్తపల్లి మున్సిపల్ ఎన్నికల లెక్కింపు లో మొత్తం 12 వార్డులు గాను 11 టిఆర్ఎస్ విజయం 1 కాంగ్రెస్ గెలుపొందింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, అసిస్టెంట్ కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 34 వార్డుల కౌంటింగ్ ప్రక్రియ అధికారులు ప్రారంభించారు.

తెలంగాణలోని 120 మున్సిపాలిటీలకు, 9 నగరపాలక సంస్థలకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. ఈ స్థితిలో టీఆర్ఎస్ తన సత్తాను చాటుతోంది.