హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలు గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ను కలిశారు. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను తక్షణమే నిలిపివేయాలని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. 

కరీనంగర్ ఎంపీ బండి సంజయ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ తోపాటు పలువురు బీజేపీ నేతలు గవర్నర్ సౌందర రాజన్ ను కలిసిన వారిలో ఉన్నారు. కరీనంగర్ లోని ఏజెన్సీలో అక్రమ మైనింగ్ ను అరికట్టాలని గవర్నర్ ను కోరారు. 

అక్రమ మైనింగ్ వల్ల గిరిజనులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అలాగే ప్రకృతి ఇచ్చిన సహజ సంపద నష్టపోతున్నామని వారు గవర్నర్ కు వివరించారు. కరీనంగర్ లో అక్రమ మైనింగ్ పై తక్షణమే చర్యలు తీసుకునేలా చొరవ చూపాలని గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ను కోరారు తెలంగాణ బీజేపీ నేతలు.