మహాత్మాగాంధి 150వ జయంతి పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలో స్వచ్ఛతాహీ సేవలో భాగంగా ప్లాస్టిక్  వెస్ట్ శ్రమదాన్ పేరిట కార్యక్రమము నిర్వహించారు. ఈ క్రమంలో ప్లాస్టిక్ నివారణకు అవగాహన ర్యాలీని నిర్వహించారు.

ఈ ర్యాలీలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మున్సిపల్ కమీషనర్ రవిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వాడకం పై పర్యావరణ కాపాడడంకై ప్రతిజ్ఞ చేయించి జెండా ఊపి ప్లాస్టిక్ నివారణ అవగహన  ర్యాలీ ని ప్రారంభించారు. ఈ ర్యాలీ లో యువజన మహిళ, విద్యార్థి ప్రజా తదితర సంఘాల నాయకులు  పాల్గొన్నారు