Asianet News TeluguAsianet News Telugu

ఎస్పీ రాహుల్ హెగ్డే స్పందన: తెలంగాణ పోలీసుకు సలాం కొట్టిన ఆంధ్ర టెక్కీ

దర్శనం ముగించుకొని రాత్రి హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమైన యువకునికి వేములవాడలో అనుకోని ప్రమాదం ఎదురయ్యింది. శ్రీనివాస్ కారును రాంగ్ రూట్ లో వస్తున్న ఇంకొకకారు ఢీ కొట్టింది.

SP Rahul Hegde reaction:  Andhra software engineer praises Telangana Police
Author
Karimnagar, First Published Dec 15, 2019, 1:36 PM IST

ఏదైనా హోటల్ కి వెళ్తేనో... ఏదైనా పర్యాటక ప్రదేశానికి వెళ్తేనే గూగుల్ లో రివ్యూ రాస్తారు. కానీ ఏకంగా పోలీస్ స్టేషన్ పైనే రివ్యూ రాసాడు ఆంధ్రప్రదేశ్ యువకుడు. అదిప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. హైదరాబాద్ లో నివాసముండే ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఒక సాఫ్ట్ వేర్ యువకుడు శ్రీనివాస్  కుటుంబంతో కలిసి కారులో సిరిసిల్ల జిల్లా వేములవాడకి దేవుడి దర్శనానికి వెళ్ళాడు. అక్కడ దర్శనం ముగించుకొని రాత్రి హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమైన యువకునికి వేములవాడలో అనుకోని ప్రమాదం ఎదురయ్యింది. 

శ్రీనివాస్ కారును రాంగ్ రూట్ లో వస్తున్న ఇంకొకకారు ఢీ కొట్టింది. ఆ సంఘటనలో రెండు ఎదుటి వ్యక్తి వాహనం ముందు భాగం బాగా ధ్వంసమయ్యింది. ఆ ఎదుటి వ్యక్తి శ్రీనివాస్ పై వ్యక్తిగతంగా దాడి చేశాడు. అలా దాడి చేయటమే కాక కుటుంబసభ్యలను దూషించాడు. అతనికి ఎం చేయాలో తెలియక ఆ సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే కి సోషల్ మీడియాలో మెసేజ్ చేశాడు. వెంటనే జిల్లా ఎస్పీ స్పందించటంతో వేములవాడ పోలీసులకు తక్షణం ఈ ఘటనపై చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటనను మొత్తం గూగుల్ లో ఒక రివ్యూ గా రాసుకొచ్చాడు ఆ యువకుడు, ఆ సారాంశం....

"నేను నా కుటుంబంతో కలిసీ ఈ మధ్య సోమవారం రోజు ఉదయమే హైదరాబాద్ నుండి వేములవాడ కి కారులో శివుని దర్శనం కోసం వెళ్ళాను. సోమవారం రోజు కావటంతో అక్కడ విపరీతమైన రద్దీ ఉంది. దర్శనం చేసుకున్న తర్వాత సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యాను. కానీ అనుకోకుండా జరిగిన ఒక దురదృష్టకర సంఘటనలో గుడి వెలుపల నా కారుకు రాంగ్ రూట్ లో వస్తున్న ఇంకొక కారు తగిలింది. రెండు కార్ల ముందు భాగం బాగా డామేజ్ అయ్యింది. తప్పు అతనిదే అయి ఉన్నా కానీ ఆ కారు యజమాని లోకల్ వాడు అయి ఉండటంతో నాపై వ్యక్తిగతంగా దాడి చేయటానికి ప్రయత్నించి బెదిరించాడు.

నాకేం అర్థంకాలేదు. నాపై అప్పటికే చేయి చేసుకున్నాడు. నా కుటుంబసభ్యులు కంగారు పడటం మొదలు పెట్టారు. తప్పేం లేకున్నా డబ్బులు కట్టమంటూ నన్ను కార్ లోపల ఉన్న నా కుటుంబ సభ్యుల్ని దూషిస్తుండటమే కాకుండా నాపై నా తండ్రిపై చేయి చేసుకోవటం మొదలు పెట్టాడు. ఒక్కసారిగా మేము షాక్ లోకి వెళ్లిపోయాం. నాపై అనేకరకాలుగా దౌర్జన్యం చేస్తూ నా కారు కీస్ లాక్కున్నాడు. మమ్మల్ని అంతగా చేస్తున్న అక్కడ ఉన్న వాళ్లు చూస్తున్నారు తప్పితే ఎం పట్టించుకోవటంలేదు. నేను వెంటనే ఆ జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే గారు సొషల్ మీడియాలో ఉన్నట్టు ఒకసారి చూడటంతో మీ జిల్లా పరిధిలో నాకు ఇలా జరిగిందని వెంటనే ఒక మెసేజ్ పెట్టాను. కానీ అప్పటికే నా భార్య భయంతో 100 కి కాల్ చేసి ఉండటంతో లోకల్ పోలీసులు ఒక 5 నిమిషాల్లో చేరుకొని వెంటనే ట్రాఫిక్ ని సరి చేసి నన్ను అతన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు.

నేను అదే మొదటిసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళటం. పైగా నేను ఆంధ్రా ప్రాంతానికిచెందిన వాడిని నాకు అక్కడ ఎం తెలియదు. అతను లోకల్ వాడు కావటంతో అతనితో ఆ పోలీసులు క్లోజ్ గా మాట్లాడటం గమనించాను. నేను ఇంకా ఆంధ్రా ప్రాంతం నుండి అని తెలిస్తే అసలు వదిలిపెట్టరేమో అనుకున్న. ఇంకా నా నుండి ఎంతో కొంత డబ్బు గుంజి వదిలిపెడతారు. ఆ డబ్బు దేవునికి ఇచ్చాననుకోవాల్సిందే అనుకున్న. పోలీస్ స్టేషన్ ముందు భాగంలోకూర్చోబెట్టారు. చాలా నీట్ గా ఉంది స్టేషన్. రిసిప్షన్ లో ఒక లేడీ కానిస్టేబుల్ కొందరికి సూచనలు ఇస్తూ కనిపించింది. నాకు చాలా భయంగా ఉండింది. నేను అంతకుముందే 40 నిమిషాల ముందు సొషల్ మీడియాలో చేసిన మెసేజ్ కి సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే గారి నుండి రిప్లై మెసేజ్ వచ్చింది. లోకల్ పోలీసులకు ఇంఫార్మ్ చేసినట్లుగా వాళ్ళు ఏంజరిగిందో తెలుసుకొని దానికి అనుగుణంగా వెంటనే చర్యలు తీసుకుంటారని టెన్షన్ తీసుకోవద్దని చెప్పారు. ఇంకా ఏదైనా సహాయంకావాలంటే తన నెంబర్ కి కాల్ చేయమని నెంబర్ ఇచ్చారు. ఈ మెసేజ్ చూసుకుంటుండగానే నాకు ఆ స్టేషన్ సిఐ నుండి  పిలుపొచ్చింది.

జరిగిన విషయం సిఐ గారికి చెప్పగానే అక్కడ ఉన్న సిసి కెమెరాల ఫుటేజీ చూసుకొని జరిగిన సంగతి విచారించుకొని అతనిపై కేసు బుక్ చేయాల్సిందిగా సిఐ గారు ఆదేశించారు. అసలు ఆశ్చర్యం అనిపించింది. అక్కడి సిరిసిల్ల జిల్లా పోలీసుల పని తీరు చూసి. ఎస్పీ గారు వెంటనే సోషల్ మీడియా లో స్పందించటం.. సిఐ గారు టెక్నాలజీ సహాయంతో నిజ నిర్దారణ కోసం సంఘటన జరిగిన స్థలంలో అసలు ఏంజరిగిందో చూడటం టక టక జరిగిపోయాయి. వేములవాడ సిఐ గారి రెస్పాన్స్ అయితే చాలా వేగంగా ఉంది. పోలీసులు ఇంత వేగంగా స్పందించి నాలాంటి సామాన్యులకు కూడా సకాలంలో స్పందిస్తారని అసలు ఊహించలేదు. 

ఇలా గూగుల్ తన అనుభవాన్ని రాసుకొచ్చాడు. దీంతో ఈ రివ్యూ ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ మధ్యే దిశ సంఘటనతో తెలంగాణ పోలీసులు కూడా డయల్ 100 ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. ఇలాంటి సంఘటనల్లో పోలీసులు వేగంగా స్పందించటం పట్ల ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడుతుంది

Follow Us:
Download App:
  • android
  • ios