జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని కుస్తాపూర్ గ్రామంలో పవిత్ర శ్రావణమాసం  రోజునే అద్భుత ఘటన చోటుచేసుకుంది. ఆ పరమశివుని మెడలో నాగాభరణం మాదిరిగా శ్రీ రామలింగేశ్వర ఆలయ గర్భగుడిలో శివలింగంపై నాగుపాము దర్శనమిచ్చింది. శ్రావణ మాసం 3వ సోమవారమే ఈ అరుదైన ఘటన చోటుచేసుకోవడంతో ఈ వింతను చూసేందుకు భక్తులు ఆలయానికి భారీగా విచ్చేశారు. గర్భగుడిలో శివలింగంపై ఉన్న నాగుపాము స్వయంగా ఈ మహాశివుడి నాగాభరణంగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.