ఆర్టీసీ బస్సుల్లో ఆర్టీఏ తనిఖీలు: అధిక ఛార్జీలు వసూలుపై వార్నింగ్
పలు చోట్ల తాత్కాలిక కండక్టర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తుండటంతో రవాణా శాఖ అప్రమత్తమైంది. కోరుట్లలోని పలు ఆర్టీసీ బస్సుల్లో జిల్లా రవాణా శాఖ అధికారి జి. కిషన్ రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు
ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రత్యామ్నాయ బస్సుల ద్వారా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తోంది.
అయితే పలు చోట్ల తాత్కాలిక కండక్టర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తుండటంతో రవాణా శాఖ అప్రమత్తమైంది. కోరుట్లలోని పలు ఆర్టీసీ బస్సుల్లో జిల్లా రవాణా శాఖ అధికారి జి. కిషన్ రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
నిబంధనలకు విరుద్ధంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని..అలాగే ప్రయాణికులు కండక్టర్లకు అదనపు ఛార్జీలు చెల్లించొద్దని ఆయన సూచించారు.
మరోవైజు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు తొమ్మిదో రోజు సమ్మెలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా డిపో ఎదుట రోడ్డుపై వంటా వార్పు చేయడంతో పాటు రోడ్డు మీదే భోజనం చేసి నిరసన వ్యక్తం చేశారు.