పెద్దపల్లి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బంధువుల ఇంటి నుండి స్వస్థలానికి తండ్రీ కొడుకులు కారులో వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో తండ్రీకొడుకులిద్దరు అక్కడికక్కడే మృత్యువాలపడ్డారు. 

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సామంతుల శంకరయ్య కుటుంబంతో కలిసి కలిసి కారులో చొప్పదండి మండలం రాగంపేటలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం తిరుగుప్రయాణం కాగా ధర్మారం మండలం బంజరుపల్లె వద్ద వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. 

read more  హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటళ్లో రేవ్ పార్టీ: అరెస్ట్ అయిన వారిలో మంత్రి బంధువు..?

ఎదురుగా మితిమీరిన వేగంతో వస్తున్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో శంకరయ్యతో పాటు ఆయన  కొడుకు అశోక్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. హరీష్, సుకుమార్ లు తీవ్రంగా గాయపడ్డారు. 

ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన ఇద్దరినీ మొదట హాస్పిటల్ కు తరలించారు.  ఆ తర్వాత  పోస్టుమార్టం నిమిత్తం తండ్రీ కొడుకుల మృతదేహాలను ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో వున్నట్లు సమాచారం.