కరీంనగర్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ రిమాండ్ ఖైదీ మృతిచెందాడు. దొంగతనం కేసులో అరెస్టయిన కొమురయ్యను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించగా    చికిత్స పొందుతూ మృతిచెందాడు. 

శంకరపట్నం మండలం ఇప్పలపల్లికి చెందిన కొమురయ్య అనే వ్యక్తి దొంగతనం కేసులో అరెస్టయి కొద్దిరోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే నిన్న(ఆదివారం) రాత్రి మతిస్థిమితం లేనట్టుగా వ్యవహరించడంతో  కరీంనగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్సపొందుతూ అతడు చనిపోయినట్లు జైలు సూపరింటెండెంట్ వెల్లడించారు. 

కొమరయ్య మృతి గురించి జైలు సిబ్బంది అతడి కుటుంబసభ్యులకు తెలియజేశారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. రిమాండ్ ఖైదీగా వున్న కొమరయ్య మృతికి గల కారణాలు తెలియాల్సి  వుంది. అతడు అనారోగ్యంతో చనిపోయాడా లేక వేరే కారణాలేమైనా వున్నాయా అన్నది తెలియాలి.