గతంలో పిడిఎస్ రైస్ అక్రమంగా రవాణా చేసిన 150 మందికి  కౌన్సిలింగ్ ఇచ్చారు,పిడిఎస్ రైస్ అక్రమ రవాణా చేసిన  150 మందిని కమీషనరేట్ పోలీసులు  బైండో వర్ చేశారు. 

మంచిర్యాల జిల్లాలో .. అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు. 
రామగుండము పోలీస్ కమీషనర్ గారి ఆదేశాలమేరకు    టాస్క్ ఫోర్సు సిఐ కుమార్ స్వామి  గారి అధ్వర్యంలో టాస్క్ ఫోర్సు బృందం ,స్థానిక మందమర్రి పోలీసులు మందమర్రి రైల్వే స్టేషన్ నుండి ట్రైన్ ద్వారా  మహారాష్ట్రకు అక్రమ రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమచారంతో మందమర్రి పోలీస్ స్టేషన్   పరిధిలోని రైల్వే స్టేషన్ లో  తనిఖీ నిర్వహించి పిడిఎస్ రైస్ అక్రమ రవాణా చేస్తున్న 12 మందిని అదుపులోకి తీసుకోవడం  జరిగింది , 100  క్వింటాళ్ల పిడిఎస్ రైస్ స్వాధీన పరుచుకొవడం జరిగింది.

పేకాడుతూ పట్టుబడిన పోలీసుపై సస్పెన్షన్ వేటు

మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో..
1. చొప్పదండి రమేష్, 2. నంది స్రవంతి, 3. బోగే రాజేశ్వరి, 4. బంజర తిరుపతి, 5. జి రాజేశ్వరి
05 మందిని, 60  క్వింటాళ్ల పిడిఎస్ రైస్ స్వాధీన పరుచుకొవడం జరిగింది.

చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో....
అదేవిధంగా చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో పిడిఎస్ రైస్ అక్రమ రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమచారంతో రవాణా చేస్తున్న 34 క్వింటాళ్ల పిడిఎస్ రైస్,5 ఆటోలు మరియు 5 గురిని స్వాధీన పరుచుకొవడం జరిగింది.దాని విలువ సుమారు 91,000/ఉంటుంది .
1.పర్వతం కనకయ్య 2.పర్వతం మల్లేష్ 3.నూనె గంగారం, చెన్నూరు,4. కతమంచి మహేష్, ఎన్టీఆర్ నగర్ 5.జి. భీమయ్య చెన్నూరు
34 క్వింటాళ్ల పిడిఎస్ రైస్,5 ఆటోలు మరియు 5 గురిని స్వాధీనo పరుచుకొవడం జరిగింది.దాని విలువ సుమారు 91,000/ఉంటుంది .

బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో.......
పట్టు బడిన నిందితుల వివరాలు:
1.గుండె నాగరాజు s/o   రామ్మోహన్, r/o రంగాపూర్, రాఘవ పూర్, 06  క్విటాళ్ళ పీడీఎస్ రైస్
1 . మొటం దేవేంధర్ s / o మహంకాళీ  బుడగజంగం r/ o రాజారాం, జనగాం  జిల్లా.
2.నీలేష్  నిసాత్  s/O దనుష్ నిసాత్ R/O, చతీష్ఘడ్   లారీ ఇన్ హెల్పర్
 3. సందీప్ యాదవ్ s / O సంబు రాం  యాదవ్,  చతీష్ ఘడ్  స్టేట్ (లారీ డ్రైవర్)
.4 .మోటం గురువయ్య  s / o మహంకలి కులం బుడగజంగం r/O దేవునిపల్లి,  h/O కుదురుపాక సుల్తానాబాద్  మండలం. (.ఇతనిపై గతంలో వివిధ పోలీస్ స్టేషన్ లలో  కూడా పిడిఎస్ రైస్ అక్రమ రవాణా కేసులు గతంలో నమోదు చేయడం జరిగింది)
 5.మోటం అన్నయ్య s/o వెంకటయ్య, బుడగజంగం R /O రామయ్యపల్లి,)
 6.  మోటo సారయ్య r / O నర్సింహులపల్లి
 7. మోటo రవి  r/O నర్సింహులపల్లి)
20  టన్నుల  పీడీఎస్ రైస్,  లారీ నెంబర్ CG 8 Z 0297,క్యాంపర్ నెంబర్ AP 36 TB 5079

తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ....
1.కుదిరే మొగిలి ,కాశీపేట్ మండల్
2.తొగరి మంగ ,తాండూర్  
3.తోటపల్లి విక్రం ,బెల్లంపల్లి
4.కామెర రామ్ చందర్ ,తాండూర్
18 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ స్వాధీన౦,1 ఆటో స్వాధీనo పరుచుకొవడం జరిగింది

కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో ....
మోతి జంపయ్య  ,నవాపేట్ ,రామగిరి
15 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ స్వాధీన౦,1 టాటా ట్రాలి

ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ పరిధిలో....
పస్తం అశోక్ ,గోదావరిఖని
రేవెల్లి సాగర్ ,గోదావరిఖని
04 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ స్వాధీన౦,2 XL బైక్లు స్వాధీనం

 రామగుండము పోలీస్ స్టేషన్ పరిధిలో
దండుగుల రమేష్ ,రామగుండము
రాపం తిమ్మక్క ,రామగుండము
రాపం రుక్మిణి ,రామగుండము
03 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ స్వాధీన౦

పోత్కపల్లి  పోలీస్ స్టేషన్ పరిధిలో......
మేకల కుమార్ ,కొలనూర్
పల్లెపు రాజ్ కుమార్ ,కొలనూర్
07  క్వింటాళ్ల పిడిఎస్ రైస్ స్వాధీన౦

మొత్తం స్వాధీన పరుచుకున్న వాటి వివరములు :
పిడిఎస్ రైస్ సుమారు 350 క్వింటాళ్ళు (....బస్తాలు )
వాటి విలువ సుమారు 8,75,000/-లక్షలు.
5 ఆటోలు, 1 లారీ, 1క్యాపర్

రామగుండము కమీషనరేట్ పరిదిలో పట్టుకున్న పిడిఎస్ రైస్ వివరములు :

*గత రెండు సంవత్సరం లో నమోదుఐన కేసులు 149
పట్టుబడిన పిడిఎస్ రైస్ వివరములు: 4885 క్వింటాళ్ళు
అరెస్ట్ చేయబడిన వారి వివరములు : 389
దాని విలువ 63,80,025/- రూపాయలు*


2018 సంవత్సరం లో నమోదుఐన కేసులు వివరములు
 

నమోదైన కేసులు 95
పట్టుబడిన పిడిఎస్ రైస్ వివరములు 2559.15
దాని విలువ : 34,21,955/- రూపాయలు  
అరెస్ట్ చేయబడిన వారి వివరములు : 251


2019సంవత్సరం లో నమోదుఐన కేసులు వివరములు 
నమోదైన కేసులు : 54
పట్టుబడిన పిడిఎస్ రైస్ వివరములు : 2325.9
దాని విలువ : 29,58,070/- రూపాయలు
అరెస్ట్ చేయబడిన వారి వివరములు: 138

2018, 2019 సంవత్సరంలలో పిడిఎస్ రైస్ అక్రమ రవాణా చేస్తున్న వారి పోలీస్ స్టేషన్ పరిధి మరియు వారి వివరములు..  2018, 2019 సంవత్సరాల్లో ఇప్పటివరకు సుమారుగా 150 మందిపై పిడిఎస్ రైస్ అక్రమ రవాణాకేసులు  నమోదు చేయడం జరిగింది. వారిపై అంతర్గాం,  రామకృష్ణాపూర్,  రామగిరి,  జూలపల్లి, గోదావరిఖని వన్ టౌన్,  బెల్లంపల్లి తాండూర్ బెల్లంపల్లి టు టౌన్, .  మందమర్రి, బసంత్ నగర్,  సుల్తానాబాద్,  మంచిర్యాల్,  దండేపల్లి, కాల్వశ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని సందర్భాలలో నేరుగా సివిల్ సప్లై అధికారులకు అప్పగించడం జరిగింది వారు కేసు నమోదు చేశారు. వీరందరిని కస్టడికి తీసుకోని  ఈరోజు కౌన్సెలింగ్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా వీరందరినీ బైండోవర్ చేయడం జరుగుతుంది. మీరు మరల వారి ప్రవర్తన మార్చుకోకుండా తిరిగి వారి చట్టవ్యతిరేకమైన ప్రవృత్తులు కొనసాగించినట్లు అయితే వారిపై పిడియాక్ట్ నమోదు చేయడం జరుగుతుంది అని సిపి గారు హెచ్చరించింది

నిరుపేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం కిలో రూపాయికే రేషన్ బియ్యం ఇస్తోంది లబ్దిదారులు చేతి నుంచి ఆ బియ్యం డీలర్ లేదా పచారి దుకాణం దారుని దగ్గరకు వెళ్ళే సరికి కిలో రూ.6 నుంచి రూ 8 అవుతుంది . డీలర్ లేదా పచారి దుకాణం దారుని నుండి బియ్యం అక్రమ రవాణా చేసేవారి చేతికి వెళ్ళే సరికి కిలో రూ.10 నుంచి రూ.15  అవుతుంది. అక్రమ రవాణా చేసేవారి చేతి నుండి మహారాష్ట్ర లేదా చతీస్త్గఢ్ చేరేసరికి  కిలో రూ.20 నుంచి రూ.25  అవుతుంది.ప్రభుత్వం కిలోకు దాదాపు రూ.25 సబ్సిడీ భరించి నిరుపేదలకు బియ్యం సరఫరా చేస్తుంది .కానీ కొంతమంది ఆ బియ్యం తినడం లేదు అక్కడిక్కడే అమ్మేస్తున్నారు .ఇదే అదునుగా కొంతమది అక్రమమగా అధిక డబ్బులు సంపాదించాలనే దురుద్దేశ్యం  ఫలితంగా దళారులు భారీగా లాభపడుతున్నారు .ప్రతిరోజు దాదాపు అధిక మొత్తంలో  బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు .క్వింటా బియ్యాన్ని రూ .800 నుంచి రూ 1000 కి కొనుగోలు చేసి మహారాష్ట్రలో క్వింటా రూ .2 వేల నుంచి రూ .2500 కు విక్రయిస్తూ అధిక డబ్బులు సంపాదిస్తున్నారు అని మా విచారణలో తేలింది.

బియ్యం అక్రమ రవాణా చేసే మార్గాలు :
కరీంనగర్ ,వరంగల్ ప్రాంతాల నుండి కొంతమంది పిడిఎస్ రైస్ అక్రమ రవాణా చేసే స్మగ్లర్ లుపెద్దపల్లి ,మంచిర్యాల ,బెల్లంపల్లి ,కాగజ్ నగర్ ,ఆసిఫాబాద్  మీదుగా ఆటోలు ,డిసిఎం వ్యాన్,లారీల్లో మహారాష్ట్ర కు  తరలిస్తున్నారు .అదేవిధంగా రైలు మార్గాలు అందుబాటులో ఉన్న కొత్తపల్లి,పెద్దపల్లి ,కొలనూరు,మంచిర్యాల,మందమర్రి,బెల్లంపల్లి ఇతర రైల్వే స్టేషన్ లకు రాత్రిపూట ఆటోలు ,డిసిఎం వ్యాన్ ల ద్వారా తీసుకు వచ్చి బాగ్యనగర్ ,ప్యాసింజర్ రైలు లలో మహారాష్ట్ర కు  తరలిస్తున్నారు. మరికొందరు రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చి తరలిస్తున్నారు .నూకలకు కూడా బియ్యం ధరనే చెల్లిస్తుండడంతో ఈ అక్రమ రవాణా కుడా చేస్తున్నారు.

ప్రభుత్వ పంపిణి బియ్యం అక్రమం గా  లోడ్ సమయంలో మరియు అక్రమ రవాణా సమయంలో సెంట్రిలు మరియు పైలెట్ వ్యవస్థ....

సెంట్రిల పాత్ర......సేకరించిన ప్రభుత్వ పంపిణి బియ్యం ని వారికీ అనుకూలంగా ఉన్న మారుమూల గ్రామం ని ఎంచుకొని ఆ గ్రామ వచ్చే ప్రధాన దారులలో,గ్రామ శివారులో  సెంట్రిలను 500 రూపాయలు  కూలీ ఇచ్చి ఎవరైనా కొత్త వ్యక్తులు గాని,పోలీసులు గాని  లోడింగ్ సమయలో అటు వైపు వస్తే ముందస్తూ సమాచారం ఈ సెంట్రి లు అందించే విదంగా ఏర్పాటు చేసుకుంటారు

పైలెట్ పాత్ర:
వాహనానికి 2 నుంచి 3 కిలోమీటర్ల ముందు ఒక వాహనం లో కొంతమంది వ్యక్తులు ప్రయాణిస్తూ వెళ్ళే మార్గాల లలో పోలీసుల కదలికలను  గుర్తిస్తూ లారీ లలో  ఉన్న వ్యక్తికి  సమచారం అందిస్తూ అనుకున్న ప్రాంతంకి వెళ్ళే వరకు ఫైలేట్ చేస్తారు.

మారుమూల గ్రామాల నుండి సేకరణ .....
 రేషన్ ద్వారా వచ్చే బియ్యాన్ని తినడానికి చాల మంది ఇష్టపడడం లేదు .అందుకే  రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యాన్ని అమ్మేనన్నారు.దీన్ని ఆసరాగా తీసుకొని ప్రతి నెల రేషన్ బియ్యం కోటా విడుదల అయ్యాక  పది  రోజుల తరువాత స్మగ్లర్లు పదిరోజుల  పాటు గ్రామాల్లో తిరుగుతూ బియ్యన్ని కొనుగోలు చేసి 10 నుంచి 20వ తేదీ మధ్య తేదీల్లో బియ్యాన్ని సేకరించి  కొందరు లబ్ధిదారులు బయో మెట్రిక్ మిషన్ వేలి ముద్ర వేసి కిలోకు రూ.6 నుంచి రూ.8 చొప్పున డీలర్లుకి  విక్రయిస్తున్నారు  మరికొందరు కిరాణా షాపుల నిర్వాహకులకు  అమ్ముతున్నారు. వ్యాపారులు వాటిని స్మగ్లర్లకు  అమ్ముతున్నారు

రీ-సైకిలింగ్ .....
కొంతమంది రైస్ మిల్లర్స్ రేషన్ బియ్యంని రీసైకీలింగ్ చేసి వాళ్ళు సేకరించిన పిడిఎస్ రైస్ ను లేవి రూపంలో ప్రభుత్వంకి మరల తిరిగి పంపిస్తూ లాభాలను గడిస్తున్నారు.ఇటివల రామగుండము లో  ఉమా మహేశ్వర రైస్ మిల్లు లో ఓనర్ గోలి రమణ రెడ్డి ప్రభుత్వం కి ఇవ్వవలిసిన లివి పర్సెంటేజ్ లో సుమారు 135 క్వింటాల్ ల పిడిఎస్ రైస్ ని రీసైకీలింగ్ చేసే క్రమంలో మిల్లులో పట్టుకోవడం జరిగింది.

సివిల్ సప్లై కాంట్రాక్టర్స్,డీలర్స్,నిర్లక్ష్యంగా వ్యవహరించిన  అధికారులపై చర్యలు :
రామగుండము కమీషనరేట్ పరిదిలో పిడిఎస్ అక్రమ రవాణా చేయడం పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, సివిల్ సప్లై కాంట్రాక్టర్స్ లైసెన్స్,డీలర్స్ లైసెన్స్ రద్దు కి మరియు నిర్లక్ష్యంగా వ్యవహరించిన  అధికారులపై చర్యల కొరకు సమగ్ర నివేదిక ను ప్రభుత్వంకి సర్పించబడును .ఇప్పటి నుండి కమీషనర్ రేట్ పరిదిలో పిడిఎస్ రైస్ అక్రమ రవాణా చేసే వారి ప్రవృత్తిని మార్చుకోవాలని ,లేనియెడల వారిని ఎట్టిపరిస్థితులలో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు ,వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం  జరుగుతుందని సిపి గారు హెచ్చరించారు.

పిడిఎస్ రైస్ స్మగ్లర్ల పై రామగుండo కమీషనరేట్ పోలీస్ నజర్ :
 ప్రభుత్వ పంపిణి బియ్యం అక్రమ రవాణా చేయడానికి స్మగ్లర్లు   కొత్త కొత్త ఆలోచనల తో పథకాలు వేస్తున్న వారి అంచనాలకు అందకుండా రామగుండము కమీషనరేట్ టాస్క్ ఫోర్సు, పోలీసులు ప్రజల సహకారంతో ,ఆధునాతన సాంకేతిక పద్దతుల ద్వారా వారి కదలికలను గుర్తించి పిడిఎస్ రైస్ అక్రమ రవాణా జరగకుండా దాడులు నిర్వహిస్తూ అడ్డుకట్ట వేయడం జరుగుతుంది.వారిపై కేసులు నమోదు చేసి జైలుకి పంపడం జరుగుతుంది.రామగుండము కమీషనరేట్ పరిధిలోని మంచిర్యాల ,పెద్దపల్లి జిల్లాలోని పిడిఎస్ అక్రమ  రవాణా చేసేవారి మరియు సకహరించే వారి వివరములు గ్రామీణ స్థాయి నుండి పిడిఎస్ రైస్ సేకరించే వారి ,డీలర్స్, అక్రమ రవాణా చేసే  సుమారు 60 మంది జాబితా సిద్దం చేయడం జరిగింది ,అదేవిధంగా మహారాష్ట్ర లోని వివిధ ప్రాంతంలోని స్మగ్లర్ ల జాబితా కూడా  సిద్దం చేయడం జరిగింది వీరిపై  త్వరలో చట్టరీత్య కేసులు నమోదు చేసి  కఠిన  చర్యలకు రంగం సిద్దమైంది .

ఎవరినీ వదిలేదిలేదు......
పేదల బియ్యాన్ని దోచుకుంటు అక్రమ రవాణా చేస్తున్న  అక్రమార్కులు ఎంతటి స్థాయిలో ఉన్నా వదిలేది లేదు.. ఇంకా ఈవ్యహారంపై పూర్తిస్థాయిలో కూపీ లాగుతున్నాం. పౌరసరఫరాల కమిషనర్ దృష్టికి ఈవిషయాన్ని తీసుకెళ్తాం. అందరిపై కేసులు నమోదు చేస్తాం. అవసరమైతే పీడీ యాక్టు నమోదుకు వెనకాడేది లేదు.కమీషనర్ రేట్ పరిదిలో పిడిఎస్ రైస్ అక్రమ రవాణా చేస్తున్న ఒక్కరిపై పిడి యాక్ట్ అమలు చేయడం జరిగింది. ఎన్ని సార్లు కేసులు నమోదు చేసి జైలుకు పంపిన కూడా కొంతమంది వ్యక్తులు వారి ప్రవర్తన మార్చుకోకుండా ఈ అక్రమ దందా కి పాల్పడుతున్నారు .వారి జాబితా సిద్దం చేశాం వారిపై ముందుగా పిడి యాక్ట్ త్వరలో అమలు చేస్తాం .అదేవిదంగా  మరి కొంత మంది జాబితా సిద్దం చేస్తున్నాం త్వరలోని పిడియాక్ట్  అమలు చేయడం జరుగుతుందన్నారు.

ఈ దాడిలో  టాస్క్ ఫోర్స్  అధికారులు సిఐ రాజ్ కుమార్ ,కుమారస్వామి , టాస్క్ ఫోర్స్ సిబ్బందిని సిపి  గారు అభినందించారు