Asianet News TeluguAsianet News Telugu

అనుక్షణం అప్రమత్తం... రాజన్న జిల్లాలో పోలీస్ యంత్రాంగం తీరు భేష్.

టెక్నాలజీని విరివిగా వినియోగిస్తూ సోషల్ మీడియా ద్వారా జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రజలతో సన్నిహితంగా ఉంటూ వారి సమస్యల పట్ల స్పందిస్తున్నారు. ఈ మధ్యే జిల్లాలోని బోయినపల్లి ఎస్సై ఒక కేసు విషయంలో సోషల్ మీడియా సహకారంతో ఒక చిన్నారిని కాపాడి తల్లిదండ్రుల వద్దకు చేర్చగలిగారు.

Police active in Rajanna district
Author
Sircilla, First Published Mar 13, 2020, 4:00 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థానిక పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ నేర నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావటంతో ఏ చిన్న సంఘటన జరిగినా రాష్ట్రమంతా చర్చించే అవకాశం ఉంటుంది. తెలంగాణ పోలీసు యంత్రాంగం రాష్ట్రమంతటా నేర నియంత్రణకు, రోడ్డు ప్రమాదాల నివారణలు మహిళా భద్రతకు పెద్ద పీఠ వేస్తూ వస్తుంది. అందులో భాగంగానే సిరిసిల్ల జిల్లా పోలీసులు స్థానికంగా ఎప్పటికపుడు నేరాల తీవ్రత తగ్గించే దిశగా అడుగులు వేస్తూ పాత నేరస్థులపై నిఘాపెడుతూ, నేరాలకు ఆస్కారమివ్వకుండా అడుగులు వేస్తున్నారు. 

ఇప్పటికే జిల్లాలోని రెండు డివిజన్లకు కొత్త డిఎస్పీలు వచ్చారు. జిల్లాలో ప్రధానంగా తెలంగాణ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం వేములవాడ ఉంది. ఇది ప్రముఖ పుణ్యక్షేత్రం కావటంతో రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వస్తూ పోతూ ఉంటారు. దీనికనుగుణంగా నేరాలు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. కానీ స్థానిక పోలీసులు ఎప్పటికప్పుడు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఏదైనా సంఘటన జరిగినా కానీ వెంటనే అప్పటికప్పుడు స్పదించి భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యిమిస్తున్నారు.

టెక్నాలజీ వినియోగంలో కూడా ముందున్న జిల్లా పోలీసులు

టెక్నాలజీని విరివిగా వినియోగిస్తూ సోషల్ మీడియా ద్వారా జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రజలతో సన్నిహితంగా ఉంటూ వారి సమస్యల పట్ల స్పందిస్తున్నారు. ఈ మధ్యే జిల్లాలోని బోయినపల్లి ఎస్సై ఒక కేసు విషయంలో సోషల్ మీడియా సహకారంతో ఒక చిన్నారిని కాపాడి తల్లిదండ్రుల వద్దకు చేర్చగలిగారు. అలాగే ఇటీవల పొరుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి వేములవాడ పుణ్యక్షేత్రానికి వచ్చి అనుకోని సమస్యలో చిక్కుకుంటే వెంటనే అప్పటికప్పుడు స్థానిక పోలీసులు స్పందించి అతనికి అండగా నిలిచారు. 


జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి చేసుకున్న రాహుల్ హెగ్డే

ఇప్పటికే రాజన్న సిరిసిల్ల ఎస్పీగా రాహుల్ హెగ్డే బాధ్యతలు చేపట్టి రెండేళ్లు అవుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేరెళ్ల ఘటన తర్వాత ఎన్నో ఒత్తిళ్ల మధ్య జిల్లాకు వచ్చిన ఈ పోలీస్ బాస్ స్థానిక సవాళ్లను తొందరగానే అధిగమించగలిగారు. దానికి తోడు తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో కొన్ని వినూత్న కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమంలో జిల్లా ప్రజలు ప్రత్యక్షంగా పోలీసులతో తమ సమస్యను చెప్పుకునే అవకాశం లభించటంతో పాటు కొన్ని సమస్యలకు పరిష్కారం కూడా అక్కడికక్కడే లభించింది. పైగా జిల్లా ఎస్పీగా రాహుల్ హెగ్డే బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా పోలీస్ కార్యాలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్ రావటం ద్వారా జిల్లా పోలీసుల పనితనానికి మంచి గుర్తింపు లభించినట్లయింది. 

జిల్లాలో రోడ్డు ప్రమాదాల శాతం కూడా గణనీయంగా తగ్గింది. స్థానిక పోలీస్ కళాకారులు, స్థానిక పోలీసులు కలిసి నిరంతరం ప్రజల్లో రోడ్డు భద్రత పట్ల చైతన్యాన్ని పెంచటంతో పాటు... ఎప్పటికప్పుడు రోడ్లపై తనిఖీలు చేస్తూ రోడ్డు భద్రత నియమాలు పాటించని వారి పట్ల భారీ జరిమానాలు విధించటంతో పాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. దాంతో రోడ్డు ప్రమాదాల శాతం గణనీయంగా తగ్గింది. అలాగే మహిళా భద్రత పట్ల జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. డయల్ 100 ద్వారా వచ్చే కాల్స్ పట్ల నిత్యం అప్రపత్తంగా ఉంటూ, మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. 

అడదడపా కొన్ని చేదు సంఘటనలు

జిల్లాలో నూతన సంవత్సరం వేడుకల సమయంలో ఒక చేదు సంఘటన జరిగింది. అప్పటికే అధికారులు వేడుకలు ప్రశాంత వాతావరంలో జరుపోకోవాలని ప్రచారం నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులు రోడ్డున పోయే కొందరి యువకుల్ని చితక బాదటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అది కాస్త సోషల్ మీడియాలో దేశం మొత్తం వైరల్ అవటంతో ఒక్కసారిగా జిల్లాలో అలజడి రేగింది. కానీ ఆ యువకుల్లో కొంత మంది ఒక మద్యం మత్తులో యువతి ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేశారని అందుకే పోలీసులు ఆ విధంగా లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చిందని తెలిసినా కానీ అంతగా ఆ యువకులను చితకబాదాల్సిన అవసరమేముందని కొన్ని హక్కుల సంఘాలు మండిపడ్డాయి. దాంతో ఆ సంఘటనలలో ఉన్న పోలీస్ అధికారులపై చర్యలు తీసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios