కరీంనగర్: పాలన సౌలభ్యం కోసమే ఆంధ్ర ప్రదేశ్ నుండి వేరుపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అలా  పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పాటు సంక్షేమ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందించాలన్నదే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.  నూతన రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చుకుని పాలనను ప్రజలకు మరింత చేరువ  చేశామని కేటీఆర్ తెలిపారు. 

రాజన్న సిరిసిల్ల సిరిసిల్ల పట్టణంలో పంచాయతీరాజ్ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఆయనతో  పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్ లు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణలోని అధికార యంత్రాంగం ప్రజలకు మరింత చేరువయ్యిందన్నారు. 

read more  ఎస్సీ అమ్మాయిలపై టీఆర్ఎస్ నేత వేధింపులు... బాధితులకు కేటీఆర్ భరోసా

కొత్త పంచాయతీ, మున్సిపల్ చట్టాలను తీసుకోవచ్చామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఎంతో మేధోమధనం చేసి పంచాయతీ రాజ్ చట్టాన్ని రూపొదించడం జరిగిందన్నారు. ఆ చట్టంలోని ప్రతి అంశాన్ని సీఎం క్షుణ్ణంగా పరిశీలించారని పేర్కోన్నారు. 

గ్రామీణ జీవితాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. ఆయన సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే  హరితహారం చేపట్టారని తెలిపారు. ఒక గంటలో ఏకంగా పదివేల మొక్కలు నాటించి రికార్డు సృష్టించారని అన్నారు. 

పల్లెలు పచ్చదనంతో, పరిశుభ్రంగా ఉండాలని... గ్రామ గ్రామానికి వైకుంఠధామం ఉండాలన్నారు. ప్రజలకు ఏం అవసరమో వాటిని కొత్త పంచాయతీ రాజ్ చట్టంలో కెసిఆర్ చేర్చారని కేటీఆర్ తెలిపారు.