పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఆరేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించాడు. వివరాల్లోకి వెళితే.. కాల్వశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన అష్రాఫ్ అనే యువకుడు ఆడుకుంటున్న ఓ పాపకు బిస్కెట్ ఇస్తానని మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు.

అనంతరం ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా చిన్నారి కేకలు వేయడంతో పాటు ఏడవటంతో స్థానికులు గుర్తించారు.

అష్రాఫ్‌ను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న సుల్తానాబాద్ పోలీసులు చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.