చైతన్య పురిలోని  మహాశక్తి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.  గత 9 రోజులనుండి   ప్రథమం శైలపుత్రీచ ,ద్వితీయం బ్రహ్మ చారిణీ ,త్రృతీయం చంద్రఘంటేతి ,కూష్మాండేతి చతుర్థకం ,పంచమం స్కందదమాతేతి ,షష్ఠం కాత్యాయనీ , సప్తమం కాళరాత్రీ ,మహాగౌరీ తి అష్టమం నవమం సిద్ధిధాత్రీ రూపాలలో దుర్గాదేవిని అలంకరించి విశేష పూజలు నిర్వహించారు.

రకరకాల పూలు, పండ్లతో అమ్మవారిని అలంకరించుకున్నారు.ఈ తొమ్మిదిరోజులు పల్లకిసేవలు కూడా నిర్వహించారు. కాగా... నేడు నవరాత్రుల్లో  చివరి రోజు కావడంతో 
నవరాత్రులముగింపును పురస్కరించుకుని ఉదయం  8:30 ని ల నుండి మధ్యాహ్నం 12:00 గం ల వరకు గణేశ రుద్ర నవగ్రహ సహిత""సప్తశతీ చండీ""హవనము మహాపూర్ణాహుతి  కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆలయ అర్చకులు కొరిడెశ్రీనివాస శ్రీధర వంశీశర్మల అధ్వర్యంలో  అత్యంత ఘనంగా నిర్వహించారు.అనంతరం నగర పురోహితులు మంగళంపల్లి శ్రీనివాసశర్మ భవానీ దీక్షాపరులను కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బండి సంజయ్ దంపతులను కుటుంబ సభ్యులను భక్త జనులందరినీ అందరికీ ఆరోగ్య సకలశుభాలు జరుగాలనీ ఘనంగా ఆశీర్వదించారు. 

అనంతరం అధిక సంఖ్యలో భక్తజనులు త్రిశక్తులైన 3 అమ్మవార్లనూ దర్శించుకున్నారు అర్చకులు భవానీ దీక్షా మాలా విరమణలు చేసి తీర్థప్రసాదాలు అందచేశారు.