కరీంనగర్: తెలంగాణలోని సిరిసిల్ల పట్టణానికి చెందిన వడ్డేపల్లి శ్యాం (25) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలమయిందనే మనస్తాపంతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కారణం సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో రైటర్ అని శ్యాం సామాజిక మాధ్యమంలో పోస్ట్ పెట్టాడు. 

".... నా ప్రాణానికి ప్రాణంగా ఇద్దరు. ప్రేమించుకున్నాం కలిసి తిరిగాం ఒక కంచం లో తిన్నాం ఓకే మంచం లో పడుకున్నాం కార్ లో తిరిగాం. ఒక సంవత్సరం పాటు చాలా అన్యోన్యంగా ఉన్నాం. సడన్ గా ఇద్దరు మా మధ్య లో  ఆమె అక్క చంద్రిక సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో సత్యం రైటర్ మా దూరానికి కారణం అయ్యారు" అని సూసైడ్ నోట్ లో రాశాడు. 

"అంతే కాదు నా చిట్టి  ఎన్వీ నన్ను మంది మాటలు పట్టుకొని నన్ను వద్దు అన్నవ్ కదా కని నేను మాత్రం నీ నుండి కాదు లోకం నుండి దూరం వెళ్తున్న"  అని ప్రేయసిని ఉద్దేశించి అన్నాడు. 

లవ్ యూ బంగారం అంటూ తన చివరి కోరికను చెప్పాడు. తన చావుకైనా ఇంటికి రావాలని ప్రేయసిని వేడుకున్నాడు. తనను క్షమించాలని వేడుకున్నాడు.