రామగుండం ఫెర్టిలైజర్ కంపెనీకి మోక్షం: కేటీఆర్ హామీ

ఉమ్మడి  కరీంనగర్ జిల్లాలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్దరణ విషయమై తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటుంది. ఈ విషయమై మంత్రి  కేటీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ktr reviews on ramagundam factory with industrial officers

పెద్దపల్లి: రామగుండం ఫర్టిలైజర్స్ కంపెనీ పునరుద్దరణ పనులపై  తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రికేటీఆర్  సమీక్ష నిర్వహించారు.గురువారం నాడు
 మంత్రి  కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి యంపి  వేంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్,  పరిశ్రమల శాఖాధికారులతో  మంత్రి సమీక్ష నిర్వహించారు.

కంపెనీ పున:ప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని కెటీఆర్ గుర్తు చేశారు. కంపెనీ కార్యకలాపాల ప్రారంభం కోసం అన్ని విధాల సహాయ సహాకారాలను అందిస్తామన్నారు.  ప్రజలకు తాము హమీ ఇచ్చిన మేరకు కంపెనీ పునరుద్దరణకు కృషి చేశామన్నారు. ఈ హామీ మేరకే కంపెనీ పునరుద్దరణలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష భాగస్వామ్యం(వాటా) తీసుకున్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.

మూతపడిన బిల్ట్ లాంటి కంపెనీలను తిరిగి ప్రారంభించేందుకు పరిశ్రమల శాఖ తరపున ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఫ్యాక్టరీ పునరుద్దరణ కార్యకలాపాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.  

రామగుండం  ఫ్యాక్టరీకి అవసరం అయిన ఉద్యోగాల కల్పనలో స్ధానికులకు సాద్యమైనంత మేర అవకాశాలు ఇవ్వాలని కోరారు. కంపెనీ అవసరాల మేరకు తెలంగాణ అకాడమీ అఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా యువకులకు ప్రభుత్వ ఖర్చులతో శిక్షణ ఇస్తామన్నారు.

టాస్క్ నుండే ఉద్యోగులను ఎంపిక చేసుకోవాలని ఆయన ప్రతిపాదించారు. ముఖ్యంగా స్కిల్డ్, సెమిస్కిల్డ్  సిబ్బంది కోసం టాస్క్ ద్వారా ప్రత్యేక కోర్సులు తయారు చేసి శిక్షణ ఇచ్చేందుకు సైతం సిద్దంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈమేరకు అర్ యఫ్ సియల్ తో కలిసి పనిచేయాలని సమావేశానికి హాజరైన టాస్క్ ప్రతినిధులను కేటీఆర్ ఆదేశించారు. 

అన్ స్కిల్డ్ కార్మికులను జిల్లా ఎంఫ్లాయ్ మెంట్ ఎక్జ్సేంజీ ద్వారా భర్తీ చేసుకునే అవకాశాలను పరిశీలించాలన్నారు. కంపెనీ పరిసరాల్లో గతంలో ఉన్న కేంద్రీయ విద్యాలయాన్ని తిరిగి ప్రారంభించాలని స్ధానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. 

ఈమేరకు పాత కేంద్రీయ విద్యాలయాన్ని పున:ప్రారంభించేందుకు కేంద్ర మానవవనరుల శాఖా  మంత్రికి ఒక లేఖ రాస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతోపాటు కంపెనీకి అవసరం అయిన రవాణా, హమాలీ వంటి అంశాల్లోనూ కంపెనీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ఉపయోగించుకోవాలని మంత్రులు కోరారు. ఈ సమావేశంలో అర్ యఫ్ సియల్ అధికారులతో పాటు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.

ktr reviews on ramagundam factory with industrial officers

ktr reviews on ramagundam factory with industrial officers
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios