గోదావరిఖని లోని శారదనగర్ గవర్నమెంట్ బాలికల కళాశాలలో స్థానిక పోలీసులు ఆద్వర్యంలో విద్యార్ధులకు స్వీయ రక్షణ కోసం కరాటే శిక్షణ అందించారు. ముఖ్యంగా స్కూల్ విద్యార్థినిలపై జరుగుతున్న దాడులను దృష్టిలో వుంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పెద్దపల్లి డిసిపి పులిగిల్ల రవీందర్ వెల్లడించారు. విద్యార్థులు క్లిష్టపరిస్థితుల్లో వున్నపుడు ఇతరుల సాయంకోసం ఎదురుచూడకుండా స్వయంగా తమను తాము రక్షించుకోవాలంటే ఇలాంటి శిక్షణ తప్పనిసరి అని డిసిపి తెలిపారు. 

తమకు తాము స్వయంగా రక్షించుకునేలా విద్యార్థినిల్లో మనోధైర్యాన్ని నింపేందుకే ప్రత్యేకంగా కరాటే (మార్షల్ ఆర్ట్స్) లో శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. సోమవారం గోదావరిఖని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉచిత కరాటే శిక్షణను పెద్దపల్లి  డిసిపితోపాటు ఏసీపీ ఉమేందర్  ప్రారంభించారు.  

ఈ సందర్బంగా డిసిపి మాట్లాడుతూ....మహిళలు, విద్యార్థినిల రక్షణకు పూర్తి స్థాయి భద్రతను ఏర్పాటు చేస్తామని.. వారు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆపత్కాలంలో విద్యార్ధులను రక్షించేందుకే తామున్నామని డిసిపి భరోసా ఇచ్చారు. 

read more  పోలీసులూ జాగ్రత్త... మీకు శిక్ష తప్పదు: చంద్రబాబు హెచ్చరిక

గోదావరిఖని ఏసిపి ఉమేందర్  గారు మాట్లాడుతూ.. విద్యార్థులపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని వారికి ఉచితంగా కరాటే శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. అన్ని పాఠశాలలోని విద్యార్థినిలు అందరికీ కూడా కరాటే శిక్షణ తరగతులు నిర్వహింపచేస్తామని పేర్కొన్నారు. 

కరాటేతో శారీరక దారుఢ్యం తో పాటు మానసిక ఉల్లాసం ఉందని అదేవిధంగా మనలో ఏదో తెలియని ధైర్యం పెంపొందుతుందని చెప్పారు. కరాటే శిక్షణ నిరంతరం కొనసాగుతుందని ఏసీపీ గారు వివరించారు. 

READ MORE  JusticeForDisha: షాద్ నగర్ కు చంద్రబాబు... దిశా ఉదంతంపై మరోసారి సీరియస్ కామెంట్స్

ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ రజిత, కరాటే అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తగరపు శంకర్, విక్టరీ షోటోకాన్ మాస్టర్లు వడ్డేపల్లి సురేష్, బోయ పోతూ రాము తదితరులు పాల్గొన్నారు. సీనియర్ విద్యార్ధులు కోట అభినయ, నల్లి మధులిక చేసిన సెల్ఫ్ డిఫెన్స్ ప్రదర్శనను పోలీసు అధికారులు అభినందించారు.