కరీంనగర్: పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బొడిగె శోభ ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్ లపై కేసు నమోదు  చేయాలంటూ ఫిర్యాదు చేశారు. ఆర్టీసి కార్మికుల ఆత్మహత్యలకు వీరే కారణమంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఇంధనం లేక నడిరోడ్డుపై నిలిచిన ఆర్టీసి బస్సు

కరీంనగర్ డిపో కు చెందిన ఆర్టీసి బస్ హైదరాబాద్ వెళ్తుండగా రోడ్డుపై హఠాత్తుగా ఆగిపోయింది. కరీంనగర్ లో హడావుడిగా బస్సును తీసుకుని బయలుదేరే క్రమంలో డీజిల్ ను చెక్ చేసుకోలేదని తాత్కాలిక డ్రైవర్ తెలిపాడు. దీంతో మేడ్చల్ క్రాస్ రోడ్ వద్ద బస్సు నిలిచిపోయింది. ఈ ఘటనతో బస్సులోని 60 మంది ప్రయాణికులు ఇబ్బందిపడాల్సి వచ్చింది. 

మిషన్ భగీరథపై స్థానిక మంత్రి సమీక్ష

 కరీంనగర్ కలెక్టరేటు సమావేశ మందిరంలో మిషన్ భగీరథ పనుల పురోగతిపై బిసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులతో సమావేశమయ్యారు. ముఖ్యంగా అర్బన్,రూరల్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షను నిర్వహించారు.