డ్రోన్ ద్వారా మందుబాబులను పట్టుకున్న పోలీసులు.. మరిన్ని
పెద్దపల్లి జిల్లా రంగాపూర్ గ్రామంలోని అసైన్డ్ భూమి నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పెద్దపల్లి జిల్లా రంగాపూర్ గ్రామంలోని అసైన్డ్ భూమి నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుపై స్పందించిన రామగుండం పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని గరుక కుమార్, ఆర్ని అజయ్, దయాసాగర్‌లు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా మంథనిలో పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిములు నిరసన నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ ఆఫీసు నుంచి చౌరస్తా వరకు 150 మీటర్ల భారీ జాతీయ జెండాతో వారు ఆందోళన నిర్వహించారు.
బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచనల మేరకు ఆదివారం ఆదివారం శ్వేతా హోటల్ లో కరీంనగర్ నగర పాలక సంస్థ సిక్స్ మెన్ కమిటీ ,కొత్తపల్లి మున్సిపల్ ఎన్నికల కమిటీ 3 మెన్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో రానున్న నగరపాలకసంస్థ ,మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులు...తమ డివిజన్ లకు , వార్డులకు , ఇంచార్జ్ లుగా నియమింపబడిన కమిటీ సభ్యులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రిజర్వేషన్ ప్రకటించిన తరువాత ఆశావహుల అభ్యర్థనలను పరిగణలోనికి తీసుకుని టికెట్లు కేటాయించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయములో PRTUTS-JAGTIAL వారి నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాద్యాయులు సమాజ సేవకులని వారి సేవలు ప్రస్తుత సమాజానికి చాలా అవసరమని.. మన ఉపాధ్యాయులు వారి అకుంఠిత దీక్ష కారణంగా నే మనము ప్రతి సంవత్సరం ఎస్ ఎస్ సి లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నామని సంజయ్ కుమార్ వెల్లడించారు.
ఇంటర్, డిగ్రీ చదువు ల కంటే, పాఠశాల విద్య చాలా ఖర్చు తో కూడుకున్నది అయినందున, పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివేలా ప్రొత్సహించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్షేడ్ గ్రామ శివారులో గల బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న పదిమంది మందు బాబులను ఆదివారం పోలీసులు డ్రోన్ సాయంతో పట్టుకున్నారు.
2020 జనవరి 8 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో బాగంగా రామడుగు మండల పరిధిలోని కార్ డ్రైవర్స్ యూనియన్ ఆదివారం సమ్మె పోస్టర్స్ విడుదల చేశారు. యూనియన్ మండల అధ్యక్షులు వేల్పుల శేఖర్ మాట్లాడుతూ.. రామడుగు మండల పరిధిలోని కార్ డ్రైవర్స్ లతో పాటు ఆటో డ్రైవర్లు, స్కూల్ కాలేజ్ బస్ డ్రైవర్స్, ట్రాక్టర్ ట్రాలీ డ్రైవర్స్ కూడా సమ్మెలో పాల్గొంటారని తెలిపారు. ఈ చట్టం వల్ల అనేక పెనాల్టీ లు, ఉపాధి అవకాశాలు పోతున్నాయని శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పోలీస్ కమిషనర్ ఆఫీసుకు వచ్చే పీఎస్ కమిటీ సభ్యులు, పోలీసు అధికారులు, మిత్రులు, ఇతరులు ఎవరు కూడా శాలువాలు, పూల బొకే, స్వీట్స్ తీసుకురావొద్దని నగర పోలీస్ కమీషనర్ కమలాసన్ రెడ్డి పిలుపునిచ్చారు.
అందుకు బదులుగా పండ్లు తీసుకుని వచ్చినచో వాటిని ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పంపిణీ చేయడం జరుగుతుందని సీపీ పేర్కొన్నారు. ఈ పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా ఆడంబరాలకు దూరంగా ఫోటోలు, వీడియోలు మరియు మీడియా సందడి లేకుండా ఒక సాదా సీదాగా జరుపుకోవాలని ఆయన సూచించారు.