కరీంనగర్: తిమ్మాపూర్ మండలం అలుగునూర్ కాకతీయ కెనాల్ వద్ద అదుపు తప్పి భార్యాభర్తలు ప్రయాణిస్తున్న బైక్ కాలువలోకి దూసుకెళ్లింది. భార్య నీటిలో గల్లంతు కాగా, భర్త సురక్షితంగా బయటపడ్డాడు. అతన్ని గన్నేరువరం మండలానికి చెందిన ప్రదీప్ గా గుర్తించారు. అతని భార్య ఆచూకీ కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి.

ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో మా బ్లూ కోల్ట్స్ సిబ్బంది  ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ఒడ్డున పెట్రోలింగ్ కి వెళ్తుండగా, మా బైక్ లైట్ చూసి కాలువలో కొట్టుకుపోతున్న ఒక వ్యక్తి కాపాడండి అని కేకలు వేయడంతో గమనించారు. బ్లూ కోల్ట్స్ సిబ్బంది అతన్ని కాలువ వెంట ధైర్యం చెపుతూ వెంబడిస్తూ వెంటనే సమాచారం తెలిపారు. 

సహాయక వెంటనే తాళ్ళు తీసుకొని 5 నిముషాల్లో సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని తాళ్ల సహాయంతో ఒడ్డుకు తెచ్చారు. పోలీస్ వాహనంలో ఆసుపత్రి కి తరలించారు.  ప్రస్తుతం అతని పరిస్థితి సాధారణంగా ఉంది.  కానీ ఇంకా మాట్లాడడం లేదు.

అతను తన భార్యతో కలిసి  బైక్ పై కరీంనగర్ నుండి గన్నేరువరనికి వెళ్తుండగా కెనాల్ వద్ద ఉసిళ్లు కళ్ళలో పడటంతో బైక్ అదుపు తప్పి కెనాల్ లో పడ్డట్టు తెలుస్తోంది. బైక్, అతని భార్య జాడ ఇంకా తెలియలేదు.