జగిత్యాల మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని రైతు పరస్పర సహాయ సహకార సంఘం ఆధ్వర్యంలో జరిగిన పల్లెరత్నాలకు మట్టి మనుషుల సన్మానం కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన తన చిన్ననాటి మిత్రుల గురించి తెలియజేశారు. ఎంబీబీఎస్ చదివిన వారిలో కొందరైనా కంటి డాక్టర్లు కావాలని సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.

గ్రామంలో ఉన్నత విద్యకు ప్రొత్సహమిచ్చే ఇలాంటి కార్యక్రమం చేపట్టిన రైతు పరస్పర సంఘాన్ని ఆయన ప్రశంసించారు. ఇలాంటి సంఘాలు ప్రస్తుత సమాజంలో ఎంతో అవసరమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ... ప్రభుత్వాసుపత్రులలో సౌకర్యాలతో పాటు డాక్టర్ల సంఖ్య కూడా పెంచిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు.

ఇందులో లక్ష్మీపూర్ గ్రామ డాక్టర్లు కూడా ఉన్నారని ప్రజలు వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. 30 రోజుల కార్యక్రమం ప్రతి గ్రామంలో విజయవంతమైందని... ఈ కార్యక్రమంతో గ్రామాల్లో రుగ్మతలు సైతం తగ్గుముఖం పట్టాయని సంజయ్ కుమార్ వెల్లడించారు.