నా ఆదేశాలనే పట్టించుకోరా..: ఎనిమిది మంది సర్పంచులకు కలెక్టర్ షోకాజు నోటిసులు

రైతు వేధికల నిర్మాణం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సర్పంచ్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. 

jagitial collector issued shokaz notice to 8 sarpanchs

జగిత్యాల: రాష్ట్ర ప్రభుత్వం పల్లెల అభివృద్దితో పాటు, రైతుల సంక్షేమం కోసం నిర్మిస్తున్న రైతు వేధికల నిర్మాణ పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సర్పంచులపై జగిత్యాల జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఇలా అలసత్వం వహిస్తున్న ఎనిమిది మంది సర్పంచ్ లకు షోకాజు నోటిసులను జారిచేసినట్లు జిల్లా కలెక్టర్ రవి తెలిపారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఎంజిఎన్ఆర్ఈజిఎస్ మరియు వ్యవసాయ శాఖ సమన్వయంతో గ్రామాలలో రైతువేదికలు నిర్మించుటకు మార్గదర్శకాలను జారీ చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా జిల్లాలో వివిధ అబివృద్ది పనులను పరిశీలించిన సమయంలో నిర్మాణా పనులలో నిర్లక్ష్యం వహించరాదనీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతువేదిక నిర్మాణాలు వేగవంతంగా పూర్తిచేయాలనీ సర్పంచ్ లకు ఆదేశించినట్లు తెలిపారు.

read more   ఆ విషయం తలసానికి తెలియదేమో, అందుకే చాలెంజ్: మల్లుభట్టి విక్రమార్క విమర్శ

అయినప్పటికి నిర్లక్ష్యం వ్యవహరించిన ధర్మపురి మండలం రాజారం, జైనా సర్పంచులు రంగు మమత, జే. ప్రభాకర్ రావు, రాయికల్ మండలం ధర్మాజీపేట సర్పంచ్ స్నేహ, వెల్గటూర్ మండలం గుల్లకోట, చేగ్యం మరియు వెల్గటూర్ సర్పంచులు లావణ్య,  ఆర్.లావణ్య మరియు మెరుగు మురళి, కథలాపూర్ మండలం బొమ్మెన సర్పంచ్ పి. లావణ్య, కోరుట్ల మండలం పైడిమడుగు సర్పంచ్ డి. భీమారెడ్డి లకు షోకాజు నోటిసులు జారి చేసినట్లు సర్పంచ్ స్పష్టం చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టె ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని సొంతపనిగా భావించి నిర్వహించాల్సిన బాధ్యత మన అందరిపై వుందని... మరీ ముఖ్యంగా ప్రజా ప్రతినిధులపై వుందన్నారు. కాబట్టి ఎవరు కుడా తేలికగా తిసుకోకూడదని ఈ సందర్బంగా కలెక్టర్ ఆదేశించారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios