కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో  సీఎం,మంత్రులపై బీజేపీ నేతలు పిర్యాదు చేశారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ చేరుకున్న బీజేపీ నేతలు  కేసీఆర్ తో సహా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ .పువ్వాడ అజయ్ కుమార్ . గంగుల కమలాకర్ లపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు బీజేపీ నేతలతో కలిసి వెళ్ళి కేసీఆర్ తో సహా మంత్రులు కంప్లైంట్  ఇచ్చారు. 

ఆదివారం కరీంనగర్ లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ సంఘీభావం తెలిపారు.ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల గురించి సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. సమస్యలను పరిష్కరించని మంత్రులు, సీఎం  మనోళ్లు కాదన్నారు. సమ్మె  11 రోజుకు చేరుకున్న తర్వాత మంత్రుల ఇండ్ల ముందు పిండం పెట్టాలని ఆర్టీసీ కార్మికులకు సూచించారు. 


విద్య సంస్ధలు తెరుచుకోవడం ప్రభుత్వానికి ఇష్టం లేదని, విద్యార్థులు ఆర్టీసీ సమ్మెకు మద్ధతిస్తారనే భయంతోనే ప్రభుత్వం సెలవులు పొడగించిందన్నారు. ప్రభుత్వం పెట్టుబడుదారుల  చేతుల్లో ఉందన్నారు బొడిగె శోభ. ఉత్తర తెలంగాణ రామేశ్వర్ రావుకు, దక్షిణ తెలంగాణను మెగా కృష్ణారెడ్డికి ఆర్టీసిని అప్పగించేందుకే ఈ కుట్ర జరుగుతుందని 
సంచలన కామెంట్స్ చేశారు.