చేపల కోసం ఎగబడిన జనం: నేడు అందరికీ నిరాశ (వీడియో)
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో పార్వతీ బ్యారేజ్ గేట్లు తెరవడంతో పెద్ద యెత్తున చేపలు కిందికి కొట్టుకుని వచ్చాయి. దీంతో చేపల కోసం ప్రజలు ఆదివారంనాడు ఎగబడ్డారు. నేడు వచ్చినవారికి నిరాశే ఎదురైంది.
కరీంనగర్: పార్వతి బ్యారేజ్ గేట్లు మూసివేయడంతో దిగువ భాగాన చేరిన చేపలను పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆదివారం పట్టుకెళ్లిన తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సోమవారం ఉదయమే అక్కడికి జనాలు చేరుకున్నారు.
పెద్దపెల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజీ లో నిన్న గేట్లు మూసివేయడంతో గేట్ల దిగువ బాగాన ఉన్న మడుగులోకి పెద్ద ఎత్తున చేపలు చేరాయి. నిన్నటిలాగే ఈ రోజు పట్టుకోవడాని వచ్చిన వారికి నిరాశ ఎదురయింది.
ఈ రోజు ఉదయం బ్యారేజీ 25 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలి పెట్టారు.దీంతో చేపల ఆశతో వచ్చిన వారు నిరాశతో వెళ్లిపోయారు.చుట్టుపక్కల గ్రామ ప్రజలు నిన్న తెచ్చుకున్న చేపలను ఎండలో ఆరబెట్టుకున్న దృశ్యాలను చూడవచ్చు.
"