పెద్ద శబ్దం, తీవ్ర భయాందోళనలు: పార్కింగ్ కారులో మంటలు

కరీంనగర్ లో పార్కింగ్ కారులో మంటలు చెలరేగాయి. పెద్ద శబ్దంతో మంటలు చెలరేగడంతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆ కారు టీఆర్ఎస్ నేతదిగా చెబుతున్నారు.

Fire outbreaks in parking car at Karimanagar

కరీంనగర్: రన్నింగ్‌లో ఉన్న కారు ఇంజన్ హీట్ ఎక్కి పొగలు రావడం సాధారణం. కానీ, పార్కింగ్ చేసి ఉన్న ఫార్చ్యునర్ కారులో ఏకంగా మంటలు చెలరేగిన ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రం విద్యానగర్‎లోని ఆదర్శ అపార్ట్‌మెంట్‌లో జరిగింది. అర్ధరాత్రి ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో కాలనీ వాసులు, అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న కుటుంబాలు భయాందోళనకు గురయ్యాయి. 

స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేయడంతో.. రంగంలోకి దిగిన ఫైరింజన్ మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. మంటల దాటికి కారులోని సీట్లు కాలిపోగా, ముందు టైర్లు గ్లాసు పేలడంతో పెద్ద శబ్ధం వచ్చింది. కాగా, పక్కనే ఉన్న జనరేటర్, ట్రాన్స్‌ఫార్మర్‌కు మంటలు వ్యాపించి ఉంటే పెను ప్రమాదం జరిగేదని స్థానికులు వాపోయారు. 

ప్రమాదానికి గురైంది టీఆర్ఎస్ నాయకునికి చెందిన కారుగా తెలుస్తోంది. హ్యాండ్ శానిటైజర్ కారణంగా మంటలు వ్యాపించాయని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే పార్కింక్ చేసిన కారులో మంటలు ఎలా వచ్చాయి అనేది అక్కడ ప్రశ్నార్థకంగా మారింది

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios