కరీంనగర్ జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. చొప్పదండి మండల కేంద్రంలో హెచ్‌పి పెట్రోల్ బంక్ వద్ద స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. సరుకుతో వెళుతున్న ఓ లారీ రహదారిపై వెళుతుండగా బ్రేక్ లైనర్‌లు పట్టేయడంతో మంటలు చేలరేగాయి.

అదే సమయంలో పక్కనే పెట్రోల్ బంక్ వుండటంతో వాహనదారులు, ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పెట్రోల్ బంక్ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు.

"

ఈ ఘటన కారణంగా కొద్దిసేపు పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లడానికి ప్రజలు వణికిపోయారు. చివరికి ప్రమాదమేమి లేకపోవడంతో ప్రజలు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.