జగిత్యాల: జగిత్యాల జిల్లాలో  విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పనులనిమిత్తం పొలానికి వెళ్లిన ఓ రైతు దంపతులు తిరిగి ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మితిమీరిన వేగంతో వెనుకనుండి వచ్చిన లారీ రోడ్డపక్కనుండి వెళుతున్న దంపతులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త గంగారెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా భార్య లక్ష్మి పరిస్థితి విషమంగా వుంది. 

దీంతో స్థానికులు ఆమెను వెంటనే జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా వుందని... కాపాడటానికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు తాటిపల్లి గ్రామస్తులుగా గుర్తించారు. ఈ గ్రామ శివారులోనే ప్రమాదం జరిగినట్లు  వెల్లడించారు. ప్రస్తుతం లారీతో పాటు డ్రైవర్ కూడా పరారీలో వున్నట్లు తెలిపారు. దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన లారీని గుర్తించి డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.