''సహకారసంఘం ఎన్నికలు... టీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేసిన కాంగ్రెస్''

తెలంగాణలో జరుగుతన్న సహకార సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికలను మించిపోయేలా సాగుతున్నారు. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు రాజకీయ ఎత్తుగడలను  మొదలెట్టాయి. ఈ క్రమంలో జగిత్యాలలో ఏకంగా అధికార పార్టీ అభ్యర్ధి కిడ్నాప్ కు గురయినట్లు ఎమ్మెల్యే సంజయ్ ఆరోోపించారు.

congress leaders kidnapped trs candidate: jagitial mla sanjay kumar

ఉమ్మడి కరీంనగర్: జగిత్యాల జిల్లాలో సహకార సంఘం ఎన్నికల హడావిడి సాధారణ ఎన్నికలను మించిపోయేలా వుంది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలవగా రాజకీయాలు మొదలయ్యాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా తమ అభ్యర్థులు గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తుంటే... కాంగ్రెస్, బిజెపిలు ఈ ఎన్నికల్లో అయినా పట్టుసాధించాలని చూస్తున్నారు. 

ఈ క్రమంలోనే రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ అభ్యర్థిని కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేశారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆరోపించడం సంచలనంగా మారింది.  

''జగిత్యాల మండలం సహకార సంఘ ఎన్నికల్లో ఒక సీటు ఎస్టీ రిజర్వేషన్ ఉన్నది. ఇక్కడ పోటీచేయాల్సిన తమ అభ్యర్థిని గత వారం రోజులుగా కాంగ్రెసు వాళ్ళు దాచారు. అతను ఎక్కడ ఉన్నాడో కాంగ్రెస్ నాయకులే చెప్పాలి'' అని సంజయ్ కుమార్ ఆరోపించారు. 

తెలంగాణ సచివాలయం కూల్చివేత: కేసీఆర్‌కు హైకోర్టు షాక్

ప్రతిపక్షాలు తమ అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని పార్టీలు సహకరించాలని... ఇలా బెదిరింపు దోరణితో గెలవాలనుకోవడం మంచిదికాదన్నారు.  

ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలో అత్యధికంగా టీఆర్ఎస్ నాయకులు గెలుపొందారని గుర్తుచేశారు. అలాగే వచ్చే సహకారసంఘం ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని అన్నారు.  

కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు తెలంగాణలో ఒక్క రూపాయి కూడా రాలేదని... కనీసం ఒక్క గోదాము కూడా కట్టలేదన్నారు. ధాన్యం కొనుగోలుకు కేంద్రానికి అసలు సంబంధమే లేదు... ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తోందన్నారు.  ప్రతిపక్షాలు ఏం చేసినా ఈ ఎన్నికల్లో తాము పూర్తి మెజార్టీతో గెలుస్తామని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios