కరీంనగర్: మొన్నటి వరకూ తుపాకుల కేసులో తనను ఇబ్బందిపెట్టిన ప్రభుత్వం తాజాగా సుపారీ హంతకులతో ఏకంగా చంపడానికి ప్రయత్నిస్తోందని రిటైర్డ్ సిఐ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసరి భూమయ్య సంచలన ఆరోపణలు చేశారు. గతంలో తాను నక్సలైట్ల టార్గెట్ లో వుండటంతో ప్రభుత్వం గన్ లైసెన్స్ ఇచ్చిందని... అయితే కొందరు పోలీస్ అధికారులు తప్పుడు కేసుల్లో ఇరికించి ఆ లైసెన్స్ క్యాన్సిల్ చేయించారని తెలిపారు. దీంతో తన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని... తనను హతమార్చడానికే గన్ లైసెన్స్ క్యాన్సిల్ చేయించారని ఆరోపించారు. 

తాను ప్రభుత్వ శాఖలో పని చేస్తున్నప్పుడు రిటైర్డ్ డిఎస్పి వేణుగోపాల్ ఇన్ఫార్మర్ జైపాల్ రెడ్డిని పరిచయం చేశాడని తెలిపారు. ఆ ఇన్ఫార్మర్ దాదాపు 18 నెలలు తన హయాంలో పనిచేశాడని.... ఈ సమయంలోనే తప్పుడు కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. ఈ హత్య కేసు కోర్టులో నడుస్తోందన్నారు. 

అయితే ఈ మధ్య తనను ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్య్యూ చేయగా చేయగా ఈ విషయం గురించి ప్రస్తావించానని పేర్కొన్నారు. తాను తప్పుడుకేసుల్లో ఇరుక్కోడానికి కారణమైన పోలీస్ అధికారుల పేర్లు భయటపెట్టానని... దీంతో వారి సాయంతో ప్రభుత్వం  తనను చంపడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. 

ఏసీబీ కేసులకు సంబంధించిన విషయాలు చెబుతూ ఇన్ఫార్మర్ జైపాల్ రెడ్డి, రిటైర్డ్ డిఎస్పి, ప్రస్తుతం ఎస్‌ఐబి అధికారి వేణుగోపాల్ గురించి ప్రస్తావించానని అన్నారు. దీంతో వేణుగోపాల్ ప్రభుత్వ అండదండలతో తననుచంపడానికి ప్రయత్నిస్తున్నారని... ఇందుకోసం సుఫారీ గ్యాంగ్ లను రంగంలోకి దించారని ఆరోపించారు.  

గతంలో కలిసి పనిచేసిన చనువుతో ఇన్ఫార్మర్ జైపాల్ రెడ్డిని ''ఓ మోసగాడా బాగున్నావా'' అని సరదాగా అన్నానని... దీంతో అతడు తనపై హైదరాబాదులోని చైతన్యపురి పీఎస్ లో ఫిర్యాదు చేశాడని అన్నారు. దీనిపై ఎంక్వయిరీ కూడా జరుగుతోందన్నారు. ఇంత చిన్నవిషయానికే రియాక్ట్ అయిన పోలీసులు తననుచంపడానికి సుఫారీ ఇచ్చారని ఆరోపిస్తున్నా ఎందుకు రియాక్ట్ కావడం లేదని భూమయ్య ప్రశ్నించారు. 

''కేవలం నన్ను టార్గెట్ చేసి ఈ దొంగ నాతో మాట్లాడుతూ ప్రభుత్వ అండదండలతో నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతుందన్నారు. నేను పదవీ విరమణ చేసిన తర్వాత ఒక సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ లో కొనసాగుతున్నానని... ఇలాంటి నేను వారిని ఏ విధంగా చంపగలను ప్రభుత్వానికి ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా'' అని అన్నారు.

''వేణుగోపాల్ రావు ను వెంటనే ఎస్ఐబి ఉద్యోగం నుంచి తొలగించాలని... తనపై వచ్చిన ఆరోపణలను ఎంక్వయిరీ చేసి నిజాలను బయట పెట్టాలన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీకి ఫిర్యాదు చేశాను'' అని భూమయ్య తెలిపారు.