స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కరీంనగర్‌లో నిర్వహిస్తున్న బ్యాంకుల రుణ మేళాను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్. గురువారం స్థానిక రెవెన్యూ గార్డెన్స్‌లో రెండు రోజుల పాటు జరగనున్న రుణ మేళాను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు దేశంలోని 200 జిల్లాల్లో రుణ మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో తొలిసారిగా రుణ మేళా ఏర్పాటు చేస్తున్నామని సర్ఫరాజ్ వెల్లడించారు.

ఈ రుణ మేళాలో కార్లు, బైకులు, వ్యక్తిగత రుణాలు, వ్యాపార రుణాలు, గృహ రుణాలు, పరిశ్రమ రుణాలు అందిస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కలెక్టర్ రుణ మంజూరు పత్రాలను అందజేశారు. స్వయం సహాయక బృందాలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌కు కలెక్టర్ రూ.8.95 కోట్ల రూపాయల చెక్‌ను అందజేశారు.