జగిత్యాలలో దారుణం జరిగింది. బుగ్గరం మండలం గోపాలపూర్ గ్రామంలో పాము కాటు కారణంగా చిన్నారి మరణించింది.

గ్రామానికి చెందిన సంతోష్, సుమలత దంపతుల ఏడాది బాలిక సహస్ర ఆదివారం ఇంటి పరిసరాల్లో ఆడుకుంటోంది. ఈ క్రమంలో ఓ పాము చిన్నారిని కాటువేసింది.. పాపను గుర్తించిన తల్లిదండ్రులు దానిని కర్రలతో చంపి సహస్రను హుటాహుటిన ఆసుపత్రికి తరిలించారు.

అయితే ఆసుపత్రిలో పాము కాటుకు విరుగుడు కల్పించే వ్యాక్సిన్ లేకపోవడంతో చిన్నారి మరణించింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె మరణించిందంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సహస్ర మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.