జగిత్యాల: తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారంలో బిజెపి ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్ ఎంఐఎంపై విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పోటీచేస్తే బిజెపి ఒంటరిగా పోటీచేస్తోందన్నారు. ఈ రెండు పార్టీల అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని జగిత్యాల ప్రజలకు పిలుపునిచ్చారు. 

జగిత్యాల పట్టణంలో బిజెపి తరపున పోటీ చేస్తున్న అభ్యర్ధులకు మద్దతుగా రాజాసింగ్ శనివారం ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ... నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలలో ఈ ప్రజల ఆశీర్వాదం వలనే బిజెపి గెలిచిందన్నారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసే టీఆర్ఎస్ పార్టీని మరోసారి ఓడించాలని సూచించారు.  

కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దొర ప్రొద్దున ఒకటి సాయంత్రం ఒకటి మాట్లాడుతాడని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తా అని అధికారంలోకి వచ్చి వారిని విస్మరించాడని అన్నారు. అలాగే డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తానని నిరుపేద ప్రజలకు ఆశచూపి మోసం చేశాడని రాజాసింగ్ విమర్శించారు.

read more  ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిప్పులు

తెలంగాణను బంగారు తెలంగాణా చేస్తా అని మద్యం తెలంగాణ చేస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రాన్ని 3 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టింది ఈ ముఖ్యమంత్రి కేసీఆరే అని ఆరోపించారు. ఇలా రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చాడంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డాడు. 

జగిత్యాల ప్రజలు ఎంఐఎం పార్టీ తరపున పోటీలో నిలిచిన అభ్యర్థులకు డిపాజిట్ దక్కకుండా ఓట్లు వేసి ఓవైసి సోదరులకు తగిన బుద్ది చెప్పాలన్నారు. .సీఎఎ బిల్లు తెచ్చిన తర్వాతే మన దేశంలో ముస్లింలు భారతీయ జెండా పట్టుకొని తిరుగుతూ తాము భారతీయులమని చెప్పుకుంటున్నారని... దీంతో పెద్ద అసదుద్దిన్ ఓవైసి ఇప్పుడు జన గణ పాడుతున్నాడని అన్నారు. 

త్రిబుల్ తలాక్ బిల్లుకు మద్దతుగా 50 లక్షల ముస్లింలు లేఖ రాసారని గుర్తుచేశారు. రోహింగ్యాలు మన దేశం నుండి తరిమేయాలని... అది మన అందరి బాధ్యత అని రాజాసింగ్ పేర్కొన్నారు. అలా జరగాలంటూ ఎంఐఎం పార్టీని దానికి మద్దతిస్తున్న టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని రాజాసింగ్ జగిత్యాల ప్రజలను కోరారు.