మహాకవి శ్రీశ్రీ గురించి ఈ తరంలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆయన పదాలతో ఆడుకునేవారు. మహా ప్రస్థానం, మరో ప్రస్థానం వంటి కావ్యాలు రాశారు. పదాలతో ఆడుకోవడంలో చమత్కారం ఉట్టి పడి నవ్వులు పూశాయి. ఆయన వేసిన జోక్ ల గురించి చాలా మంది చెబుకుంటారు.

శ్రీశ్రీ ఓసారి రైలులో వెళ్తున్నారట. తెలిసిన ఒకతను కనిపించి "ఊరికి వెళ్తున్నారా?" అని అడిగాడట.

"ఊరికే" అని శ్రీశ్రీ జవాబిచ్చారట. ఊరికే ఉరికనే లేదా ఉత్తగానే అనే అర్థం కూడా వస్తుంది.

...  ........ ....

శ్రీశ్రీకి సంబంధించి అటువంటిదే మరో జోక్ కూడా ఉంది.

ఆయన ఓసారి హోటల్ కు వెళ్లారట. సర్వర్ వచ్చి "ఏం కావాలి, సార్!" అని అడిగాడట.

టిఫన్స్ ఏమున్నాయని శ్రీశ్రీ అడిగితే... "అట్లు.. "అంటూ ఇంకా చెప్పబోయాడట సర్వర్.

వెంటనే శ్రీశ్రీ... "అట్లే కానిమ్ము" అని అన్నాడు. అట్లే అంటే అలాగే అనే అర్థం కూడా వస్తుంది.

నోట్: మీ జోక్స్ పంపిస్తే కూడా ఇక్కడ ప్రచురిస్తాం. మీ జోక్ లు pratapreddy@asianetnews.in అనే మెయిల్ కు పంపించండి.