కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో భారతీయ రైల్వే ఉద్యోగాలు భాగమే. ఐఆర్సిటిసీలో భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. కేవలం ఇంటర్ పాస్ అయితే చాలు ఈ ఉద్యోగాలు మీకు వస్తాయి. 

ఇంటర్ పాసై సిద్ధంగా ఉంటే చాలు.. అతి త్వరలోనే భారతీయ రైల్వేలలో మీకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పడబోతున్నాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అంటే ఆర్ఆర్‌బీ పెద్ద నోటిఫికేషన్ త్వరలోనే ఇవ్వబోతోంది. టికెట్ చెక్కర్ అంటే టీసీ, సిడిసి అంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీటిని నింపేందుకు ఆర్ఆర్‌బీ సిద్ధమవుతోంది. దీనికి మీరు ఇంటర్ పాస్ అయ్యి 18 నుండి 30 ఏళ్ల వయసులోకి ఉంటే చాలు. ఆర్ఆర్‌బీ పెట్టే పరీక్షలో ఉత్తీర్ణులైతే మీకు కచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఆర్ఆర్ బీ ఉద్యోగాలకు అర్హత

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారికి వయసులో సడలింపు కూడా ఉంటుంది. వారు 30 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఈ పరీక్షను రాయవచ్చు. అలాగే ఇంటర్లో 50 శాతం మార్కులు కచ్చితంగా సాధించి ఉండాలి. ఈ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీరు కచ్చితంగా చేయండి. ఈ నోటిఫికేషన్ అతి త్వరలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు న్యూస్ పేపర్లు ఫాలో అవుతూ ఉండండి.

ఆర్ఆర్‌బీ నిర్వహించే పరీక్షకు హాజరు అవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం జనరల్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంగ్లీషు వంటి వాటిలో శిక్షణ తీసుకోవాలి. రాత పరీక్ష తర్వాత శారీరక దృఢత్వ పరీక్ష కూడా ఉంటుంది. అలాగే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. ఆ తర్వాతే ఉద్యోగ నియామకాలు జరుగుతాయి.

షిఫ్టుల్లో ఉద్యోగం

ఆర్ఆర్‌బీలో ఈ ఉద్యోగాలు కోసం వివిధ షిప్టుల్లో పనిచేయాల్సి వస్తుంది. అలాగే మీరు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రైలులో ప్రతిరోజు ప్రయాణించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యోగం చేయడానికి ఎంతో ఓపిక ప్రయాణం చేసే సామర్థ్యం ఉండాలి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కాబట్టి జీతాలు ప్రతి ఏడాది సంతృప్తికరంగానే పెరుగుతాయి. పైగా ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. ఎన్నో అదనపు లాభాలు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ముందుగానే పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం ఉత్తమం.