ఇటీవలే కేంద్ర కేబినెట్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను విలీనం చేసేందుకు అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. ఈ విలీనంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తరువాత మూడో అతిపెద్ద బ్యాంక్‌గా  బ్యాంక్ ఆఫ్ బరోడా అవతరించింది. దీంతో పెరుగుతున్న వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ బ్యాంక్ భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి సిద్దమైంది. అందుకు అనుగుణంగా దాదాపు 913 ఉద్యోగాలకు నోటిపికేషన్ జారీ చేసింది. 

ఈ నోటిపికేషన్ ద్వారా వివిధ కేటగిరీల్లో స్పెషటిస్ట్ ఆపీసర్ల నియామకాలను చేపట్టనున్నట్లు బ్యాంక్ బరోడా ప్రకటించింది. లీగల్ వ్యవహారాలను చూసుకోడానికి బ్యాచిలర్ ఆఫ్ లా అర్హతతో కూడిన ఉద్యోగాలు, మార్కెటింగ్, సేల్స్, మ్యూచువల్ ఫండ్, ఇన్సూరెన్స్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.    

ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మొదట ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ  నిర్వహించి...దాని ఆధారంగా అభ్యర్థులను  తుది ఎంపిక చేయనున్నారు.