బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారతదేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బి‌ఐ) బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ (పిఒ) పరీక్ష తేదీలను విడుదల చేసింది.

పరీక్షకు సంబంధించిన తేదీలు, ఇతర వివరాలను ఎస్‌బి‌ఐ అధికారిక వెబ్‌సైట్ - sbi.co.in లో విడుదల చేస్తుంది. ఎబిఐ పిఒ 2020 నోటిఫికేషన్ ప్రకారం ప్రిలిమినరీ పరీక్ష 31 డిసెంబర్ 2020, వచ్చే యేడాది జనవరి 2, 4, 5 2021న జరుగుతుంది.

ఎబిఐ పిఒ 2020 పరీక్ష దరఖాస్తు ఫీజు జనరల్ / ఇడబ్ల్యుఎస్ / ఓబిసి అభ్యర్థులకు రూ.750, ఎస్సీ / ఎస్టీ / పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు కల్పించారు.

ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 2వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ఎస్‌బిఐ తెలిపింది. వీటిలో 200 ఉద్యోగాలు సమాజంలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న అభ్యర్థులకు కేటాయించారు. అభ్యర్థులు ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ, ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ క్లియర్ చేసిన వారికి ఉద్యోగం లభిస్తుంది.

మొత్తం 2వేల పోస్టులలో 810 పోస్టులు జనరల్ కేటగిరీకి, 540 పోస్టులు వెనుకబడిన తరగతులకు, 300 పోస్టులు షెడ్యూల్డ్ కులానికి, 200 పోస్టులు ఆర్థికంగా బలహీనమైన విభాగానికి,  షెడ్యూల్డ్ తెగల వర్గానికి 150  పోస్టులు కేటాయించారు.

also read సికింద్రాబాద్‌లో ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. ...

ఎస్‌బి‌ఐ పిఒ రిక్రూట్మెంట్ 2020: అర్హత

అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం లేదా సెమిస్టర్‌లో ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇంటర్వ్యూకి సమయంలో వారు గ్రాడ్యుయేషన్ డిసెంబర్ 31న లేదా అంతకన్నా ముందు ఉత్తీర్ణులైనట్లు రుజువును సమర్పించాల్సి ఉంటుంది.    

వయస్సు: దరఖాస్తు చేసుకోవడానికి అర్హతగల అభ్యర్ధులు కనీసం 21 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాల వయస్సులో వారై ఉండాలి. 4 ఏప్రిల్ 2020 నాటికి వయస్సు లెక్కించబడుతుంది.

ఎస్‌బి‌ఐ పిఒ రిక్రూట్మెంట్ 2020: ఎగ్జామ్ ప్యాటర్న్ 

ప్రిలిమ్స్ కోసం ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీపై  ప్రశ్నలు ఉంటాయి. సెక్షనల్ కట్‌-ఆఫ్‌లు తొలగించారు. ఆన్‌లైన్ పరీక్షలో మొత్తం 100 మార్కులకు ఒక గంట సమయం ఉంటుంది.