ఇండియన్ రైల్వే నోటిఫికేషన్‌ విడుదల.. టెన్త్‌, ఐటీఐ అర్హత ఉన్నవారు వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..

 బనారస్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌ (బీఎల్‌డబ్ల్యూ)లో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

indian railways recruitment 2021 released class 10 passed candiates can apply for 374 iti non iti seats at blwactapprentice in

ఇండియన్ రైల్వే పదో తరగతి పూర్తి చేసి లేదా ఐ‌టి‌ఐ అర్హత ఉన్నవారి కోసం  ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని బనారస్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌ (బీఎల్‌డబ్ల్యూ)లో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 15 దరఖాస్తు చేసుకోవడానికి  చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://blwactapprentice.in/ లేదా http://www.blwactapprentice.in/ అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 374
1. నాన్‌ ఐటీఐ-74 
ఫిట్టర్- 30, మెషినిస్ట్-‌ 15, వెల్డర్-‌ 11, ఎలక్ట్రీషియన్- 18

2. ఐటీఐ సీట్లు-300
ఫిట్టర్-‌ 107, కార్పెంటర్-‌ 3, పెయింటర్- 7, మెషినిస్ట్-‌ 67, వెల్డర్- 45, ఎలక్ట్రీషియన్- 71

అర్హతలు: నాన్‌ ఐటీఐ పోస్టులకు పదో తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఐటీఐ పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేదీ: 15 ఫిబ్రవరి 2021
అధికారిక వెబ్‌సైట్‌:https://blwactapprentice.in/ లేదా https://blw.indianrailways.gov.in/

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios