దేశవ్యాప్తంగా సమ్మె...రేపు మూగబోనున్న బ్యాంకు సేవలు

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా ఈనెల 22వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఈ సమ్మె వల్ల బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని భావిస్తున్నారు.

Banking services may be hit on 22 Oct as unions warn of strike

ఈ నెల 22న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చాయి ప్రధాన బ్యాంకు ఉద్యోగ సంఘాలు. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఈ సమ్మెకు దిగుతున్నట్లు తెలిపాయి. మొత్తం ఆరు డిమాండ్లతో కూడిన నోటీసులను ఇండియన్ బ్యాంకు అసోసియేషన్​కు అందజేశాయి.

ఆల్‌ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ఏఐబీఈఏ), బ్యాంకు ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఈఎఫ్‌ఐ) సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి.ఈ మేరకు వారు ఇండియన్‌ బ్యాంకు అసోసియేషన్‌ (ఐబీఏ)కు నోటీసులు అందజేశారు. 

విలీనం ద్వారా పలువురు ఉద్యోగాలు, పదోన్నతులు కోల్పోయే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ రంగ కష్టాలు తీర్చేందుకు ఎగవేతదారుల నుంచి రుణాలు వసూలు చేస్తే సరి పోతుందని, దానికోసం విలీనం చేయాల్సిన పని లేదని బ్యాంకు ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.

Banking services may be hit on 22 Oct as unions warn of strike

 

సంస్కరణల పేరిట సామాన్య వినియోగదారులపై అధిక సర్వీస్‌ ఛార్జీలు వేసే ప్రయత్నం చేస్తున్నారని  బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. ఈ నోటీసులో మొత్తం 6 అంశాలను పేర్కొంటూ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి ఉద్యోగ సంఘాలు. గతనెల 26 నుంచి 27నే సమ్మె చేయాలని పిలుపునిచ్చినా.. చివరి నిమిషంలో సమ్మెను వాయిదా వేశాయి.

ఇక నుంచి తెలుగులో బ్యాంక్ పరీక్ష

ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు బ్యాంకుల విలీనం ప్రతిపాదనను కేంద్రం తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా పంజాబ్​ నేషనల్ బ్యాంకులో.. ఓరియంటల్ బ్యాంక్​ ఆఫ్ కామర్స్, యునైటెడ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను కలపి రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా మార్చాలని నిర్ణయించింది. కెనరా బ్యాంకులో.. సిండికేట్ బ్యాంక్​ను విలీనం చేయాలని ప్రతిపాదించింది.

ఇదే జరిగితే కెనరా బ్యాంకు 4వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరిస్తుంది. యూనియన్ బ్యాంకులో.. ఆంధ్రా బ్యాంకు, కార్బొరేషన్ బ్యాంకులను విలీనం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విలీనం పూర్తయితే యూనియన్ బ్యాంక్​ 5వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా తయారవుతుంది. 

Banking services may be hit on 22 Oct as unions warn of strike

ఇక ఇండియన్​ బ్యాంకులో.. అలహాబాద్​ బ్యాంకును విలీనం చేయాలని ప్రభుత్వ ప్రతిపాదన. ఈ విలీనం పూర్తయితే దేశంలో 7వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఇండియన్ బ్యాంకు అవతరిస్తుంది. సర్కార్ ప్రతిపాదించినట్లే బ్యాంకుల విలీనం పూర్తయితే దేశంలో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే ఉండనున్నాయి.

SBI ఎడ్యుకేషన్ లోన్ పొందడం ఎలా?

బ్యాంకుల విలీనాన్ని ఉప సంహరించుకుని సత్వర వేతన సవరణ వారానికి 5 రోజుల పని దినాల అమలు చేయాలని బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విజిలెన్స్ కేసుల్లో బయటి సంస్థల జోక్యాన్ని నిలిపి వేయాలని, ఎన్​పీఎస్ స్థానంలో పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని, సేవా ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios