Asianet News TeluguAsianet News Telugu

Banks Jobs: కేంద్ర ప్రభుత్వ బ్యాంకులో 100 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..నెల 70,000 జీతం

SIDBI Officers in Grade A Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో బ్యాంకులో భారీగా ఖాళీ భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్బీఐ పర్యవేక్షణలో నడిచే SIDBI బ్యాంకులో సుమారు 100 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తికల అభ్యర్థులు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. 

Bank Recruitment 2022 online apply for 100 Assistant Manager Posts Salary up to 70000
Author
Hyderabad, First Published Mar 19, 2022, 4:54 PM IST

SIDBI Officers in Grade A Recruitment 2022:  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా, అయితే పలు నోటిఫికేషన్ల ద్వారా అనేక రంగాల్లో భర్తీలను నింపేందుకు మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే త్రివిధ దళాల్లో అనేక భర్తీలను చేపట్టేందుకు సిద్ధం కాగా, అటు రైల్వేల్లోనూ పలు భర్తీలను కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో భాగంగా ఆర్థిక రంగ సంస్థల్లోనూ భర్తీలకు కేంద్రం పెద్ద పీట వేస్తోంద. దీంతో ఉద్యోగార్థులు పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు ప్రిపరేషన్ మొదలు పెడుతున్నారు. 

తాజాగా బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కేంద్రప్రభుత్వం ఆధీనంలోని ఆర్బీఐ పర్యవేక్షణలో నడిచే SIDBI (Small Industries Development Bank of India) బ్యాంకు పలు పోస్టుల జారీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ తన అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేసింది. 

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీని కింద, గ్రేడ్ A (జనరల్ స్ట్రీమ్)లో ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు చేయమని అర్హులైన యువతీ యువకులను కోరింది.

అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో sidbi.inలో 24 మార్చి 2022 వరకు నమోదు చేసుకోవచ్చు. , దీని కోసం 16 ఏప్రిల్ 2022న ఆన్‌లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేయనుంది. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.70,000 వరకు వేతనం చెల్లించనున్నారు. 

వివిధ కేటగిరీల్లో మొత్తం 100 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలను ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తారు. ఇందులో అన్ రిజర్వడు కింద 43, ఎస్సీకి 16, ఎస్టీకి 7, ఓబీసీకి 24, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ కింది 10 పోస్టులు భర్తీ చేయనున్నారు.

పూర్తి నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

ముఖ్యమైన తేదీలు ఇవే..
దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ: 04 మార్చి 2022
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 24 మార్చి 2021
గ్రేడ్ A పరీక్ష తేదీ: 16 ఏప్రిల్ 2022
గ్రేడ్ A ఇంటర్వ్యూ తేదీ: మే 2022

విద్యా అర్హత: 
అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ, లేదా ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ (ప్రాధాన్యంగా సివిల్ / ఎలక్ట్రికల్ / మెకానికల్) లేదా ఏదైనా విభాగంలో మాస్టర్స్ డిగ్రీ (ప్రాధాన్యంగా వాణిజ్యం/ఎకనామిక్స్/మేనేజ్‌మెంట్ సబ్జెక్ట్ నుండి) యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (UGC) ద్వారా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుండి / కేంద్ర ప్రభుత్వం లేదా CA / CS / CWA / CFA లేదా Ph.D. GOI/UGC ద్వారా గుర్తింపు పొందిన సంస్థల నుండి ఉత్తీర్ణులు అయి ఉండాలి.  

వయో పరిమితి:  అభ్యర్థి వయస్సు పరిమితి 21 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ : 
ఎంపిక ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా ఆబ్జెక్టివ్ పరీక్షతో పాటు, డిస్క్రిప్టివ్ టెస్ట్‌ కూడా ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ కూడా  ఉంటుంది.

దరఖాస్తు రుసుము : 
ఇతర కేటగిరీలకు దరఖాస్తు రుసుము ₹925/- మరియు SC/ST/PwBD కేటగిరీకి ₹175/-. దరఖాస్తు రుసుము చెల్లింపును ఆన్‌లైన్ విధానంలో చేయాలి.

Follow Us:
Download App:
  • android
  • ios