బ్యాంక్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే  బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) ఖాళీగా ఉన్న 214 ఆఫీస‌ర్ (స్కేల్‌-4) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నరు.

ముంబ‌యి ప్ర‌ధాన కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ)లో ఎక‌న‌మిస్ట్‌, స్టాటిస్టిషియ‌న్‌, రిస్క్ మేనేజ‌ర్‌, క్రెడిట్ అన‌లిస్ట్‌, క్రెడిట్ ఆఫీసర్‌, ఐటీ, టెక్ అప్రైస‌ల్‌ తదితర ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హతగల అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌ ద్వారా  ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబ‌ర్ 30. మరింత సమాచారం లేదా పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://bankofindia.co.in/ చూడొచ్చు.


మొత్తం ఖాళీగా ఉన్న పోస్టులు: 214
క్రెడిట్ ఆఫీస‌ర్‌- 79
రిస్క్ మేనేజ‌ర్‌- 9
క్రెడిట్ అన‌లిస్ట్‌- 60
ఎక‌న‌మిస్ట్ లేదా స్టాటిస్టీషియ‌న్- 96

అభ్యర్డుల అర్హ‌త‌: పోస్టును బట్టి సంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్‌, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ/ ఐసీడ‌బ్ల్యూఏ/ సీఎస్‌, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌తో పాటు తప్పని సరి అనుభ‌వం ఉండాలి.
ఎంపిక చేసే విధానం: ఆన్‌లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
ద‌ర‌ఖాస్తు చేసుకునే విధానం: ఆన్‌లైన్‌ ద్వారా  దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:  రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు రూ.175.
ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది: సెప్టెంబర్‌ 30, 2020
అధికారిక వెబ్‌సైట్‌:https://bankofindia.co.in/