అలహాబాద్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్(ఎస్ఓ) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 92 ఖాళీల్లో 14ఎస్ఓ పోస్టులు( JMG Scale-I & 78 in MMG Scale-II) ఉండగా, సెక్యూరిటీ ఆఫీసర్, సివిల్ ఇంజినీర్, మేనేజర్, కంపెనీ సెక్రటరీ, ఫైనాన్షియల్ అనలిస్ట్ లాంటి ప్రత్యేక పోస్టులున్నాయి.

ఏప్రిల్ 09, 2019 నుంచి అలహాబాద్ బ్యాంక్ ఎస్ఓ పోస్టులకు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.  దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 29, 2019. అర్హులైన అభ్యర్థులు గడువులోగా అలహాబాద్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ www.allahabadbank.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

అలహాబాద్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2019 ఎంపిక ప్రక్రియ ఆన్‌లైన్/ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. రెండింట్లో వచ్చిన ఫలితాలను బట్టి అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. వారి వారి అర్హతను బట్టి అభ్యర్థులు తమకు సంబంధించిన పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: ఏప్రిల్ 9, 2019
ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ: ఏప్రిల్ 29, 2019
ఆన్‌లైన్ పరీక్ష కాల్ లేటర్ డౌన్ లోడ్ తేదీ: జూన్ 2019(తాత్కాలికం)
ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: జూన్ 2019(తాత్కాలికం)