జమ్మూకశ్మీర్ పై పాక్ మంత్రి సంచలన కామెంట్స్ చేశారు. కశ్మీర్ విషయంలో పాక్ వాదననను ఎవరూ పట్టించుకోవడం లేదని  పాక్ మంత్రి బ్రిగేడియర్ ఇజాజ్ అహ్మద్ షా పేర్కొన్నారు. కశ్మీర్ విషయంలో భారత్ చెప్పిందే అంతర్జాతీయ సమాజం నమ్ముతోందని ఆయన అన్నారు.

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సహా గత పాలకులందరూ దేశ ప్రతిష్టను నాశనం చేశారని షా దుయ్యబట్టారు. అంతర్జాతీయ సమాజంలో మనల్ని ఎవరూ నమ్మడం లేదు కశ్మీర్‌లో వారు (భారత్‌) కర్ఫ్యూ విధించారని, ప్రజలకు ఆహారం, మందులు లభించడం లేదని, ప్రజల్ని చితకబాదుతున్నారని మనం చెబుతున్నా ఎవరూ నమ్మకపోగా భారత్‌ వాదనను విశ్వసిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు పాక్‌ ప్రతిష్టను దిగజార్చారని మండిపడ్డారు.‘మనం కశ్మీర్‌ను కోల్పోయాం..మనది బాధ్యతాయుత దేశం కాద’ని ప్రజలు భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

కాగా... కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు అని నిరూపించాలని పాక్ ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైన సంగతి తెలిసిందే.