Asianet News TeluguAsianet News Telugu

వారంపాటు కంటిన్యూస్ గా ఫోన్ వాడిన యువతి.. తర్వాత ఏమైందంటే..

అక్కడ సీన్ కట్ చేస్తే.. నెక్ట్స్ సీన్ లో ఆమె హాస్పిటల్ లో చేరాల్సి వచ్చింది.

Woman Unable To Move Her Fingers After Week-Long Cell Phone Binge
Author
Hyderabad, First Published Oct 23, 2018, 2:23 PM IST

స్మార్ట్ ఫోన్లు మనం అందరం వాడుతూనే ఉంటాం. అయితే.. ఓ యువతి కాస్త ఎక్కువగా వాడేసింది. దాదాపు వారం రోజులు కంటిన్యూస్ గా స్మార్ట్ ఫోన్ వాడుతూనే ఉంది. అక్కడ సీన్ కట్ చేస్తే.. నెక్ట్స్ సీన్ లో ఆమె హాస్పిటల్ లో చేరాల్సి వచ్చింది.  ఇంతకీ ఆమెకు ఏమైందో తెలుసా..? వారం పాటు ఫోన్ ని వాడి వాడి.. ఆమె చేతివేళ్లు వంకరపోయాయి.

ఎంతలా అంటే.. టైపింగ్ పొజిషన్ నుంచి ఆమె చేతి వేళ్లు మామూలు స్థాయికి రాలేదు. దీంతో కంగారు పడిపోయిన యువతి ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకుంది.  అక్కడి మీడియా తెలిపిన వివరాల ప్రకారం... యువతి ఆఫీసుకి వారం రోజుల పాటు సెలవు పెట్టింది. తర్వాత కంటిన్యూస్ గా సెల్ ఫోనే ప్రపంచంగా బతికింది. కేవలం నిద్రపోయేటప్పుడు తప్ప.. మిగిలిన సమయమంతా ఫోన్ తోనే గడిపింది. అంతే.. ఆమె చేతులు ఆ పొజిషన్ నుంచి మాములు స్థాయికి రాలేదు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది.

చేయి అంతా కూడా భరించలేని నొప్పిగా ఉంటుందని యువతి బాధను వ్యక్తం చేసింది. ఆమె పేరు, వివరాలు బయటకు చెప్పడానికి ఆమె ఇష్టపడలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios