అతను మరో అమ్మాయితో ప్రేమలో పడ్డాడని ఆమెకు అనుమానం కలిగింది.అంతే.. అతను ఎక్కడ ఉన్నాడోనని ట్రాక్ చేసి మరీ తెలుసుకుంది. అతనిని ఫాలో అయ్యి అతని వెంటే వెళ్లింది.
ఓ యువతి.. తన బాయ్ ఫ్రెండ్ ని అతి దారుణంగా హత్య చేసింది. తనను అతను మోసం చేశాడనే కారణంతో... కారుతో తొక్కించి మరీ హత్య చేసింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అమెరికాకు చెందిన యువతి గేలిన్ మోరిస్(26) ఓ అబ్బాయి(స్మిత్) ని విపరీతంగా ప్రేమించింది. అతను కూడా తనను ప్రేమించాడని ఆశపడింది. కానీ.. అతను మరో అమ్మాయితో ప్రేమలో పడ్డాడని ఆమెకు అనుమానం కలిగింది.అంతే.. అతను ఎక్కడ ఉన్నాడోనని ట్రాక్ చేసి మరీ తెలుసుకుంది. అతనిని ఫాలో అయ్యి అతని వెంటే వెళ్లింది.
అతను ఓ బార్ కి వెళ్లగా.. ఆమె కూడా అక్కడ కు వెళ్లింది. అతను అక్కడ మరో అమ్మాయితో ఉండటం చూసి గేలిన్ కి విపరీతంగా కోపం వచ్చింది. పక్కనే ఉన్న ఖాళీ వైన్ బాటిల్ తీసుకొని...అతని పక్కన ఉన్న అమ్మాయిలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అక్కడ వారి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం.
ఆ తర్వాత.. స్మిత్.. బార్ నుంచి బయటకు వెళ్తుండగా.. ఆమె కారుతో గుద్ది అతనను చంపినట్లు అక్కడి ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెనున ఇండియానా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.
