H1B Visa:' ఆ ఒప్పంద బానిసత్వానికి ప్రతీక.. నేను అధికారంలోకి వస్తే దానిని అంతం చేస్తా'.. వివేక్ రామస్వామి
H1B Visa: పొలిటికో వార్తప్రతిక నివేదిక ప్రకారం.. 2018 నుండి 2023 వరకు US పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ H-1B వీసాల క్రింద కార్మికులను నియమించుకోవడానికి రామస్వామి యొక్క మాజీ కంపెనీ రోవాంట్ సైన్సెస్ కోసం 29 దరఖాస్తులను ఆమోదించింది. అయినప్పటికీ, H-1B వీసా విధానం సరైనది కాదని ఆయన అన్నారు.

H1B Visa: హెచ్-1బీ వీసా లాటరీ విధానానికి స్వస్తి పలుకుతామని అమెరికాలో భారత సంతతికి చెందిన రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామి హామీ ఇచ్చారు. ప్రస్తుతం లాటరీ విధానంలో ఉన్న వీసా ప్రక్రియను మెరిట్ ఆధారిత వ్యవస్థలోకి మార్చాల్సిన అవసరం ఉందనీ, ప్రస్తుత విధానం స్పాన్సర్ చేసే సదరు కంపెనీకే ప్రయోజనం కలిగించేదిగా ఉందని, ఇది సేవ ఒప్పందం లాంటిదని అన్నారు.
2024లో తాను రాష్ట్రపతిగా ఎన్నికైతే లాటరీ ఆధారిత విధానాన్ని రద్దు చేస్తానని కూడా చెప్పారు. అలాగే దాని స్థానంలో మెరిట్ ఆధారంగా అమెరికాలోకి ప్రవేశించే విధానాన్ని తీసుకొస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. H-1B వీసా భారతీయ IT నిపుణులలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. ఇది సాంకేతిక నైపుణ్యం అవసరమైన స్థానాలకు విదేశీ నిపుణులను నియమించుకునే హక్కును అమెరికన్ కంపెనీలకు అందిస్తుంది.
భారతదేశం,చైనా వంటి దేశాల నుండి ప్రతి సంవత్సరం వేలాది మంది నిపుణులను రిక్రూట్ చేసుకోవడానికి టెక్నాలజీ కంపెనీలు ఈ వీసా ప్రోగ్రామ్‌పై ఆధారపడతాయి. రామస్వామి స్వయంగా 29 సార్లు H-1B వీసా ప్రోగ్రామ్‌ను వినియోగించుకోవడం గమనార్హం. 2018 నుండి 2023 వరకు US పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవలు H-1B వీసా ప్రోగ్రామ్ కింద ఉద్యోగులను రిక్రూట్ చేయడానికి రామస్వామి మాజీ కంపెనీ రోవాంట్ సైన్స్‌ను 29 సార్లు ఆమోదించాయి.
అయినప్పటికీ.. H-1B వ్యవస్థ సరిగ్గా లేదని వివేక్ రామస్వామి చెప్పినట్టు వార్తాపత్రిక పొలిటికో పేర్కొంది. రామస్వామి తన పరిమిత ఇమ్మిగ్రేషన్ పాలసీ ఎజెండా కోసం చేసిన ప్రకటన కారణంగా పతాకశీర్షికలో నిలిచారని పొలిటికో రాసుకొచ్చింది. పత్రాలు లేని వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు
రామస్వామి ఫిబ్రవరి 2021లో రోవాంట్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవికి రాజీనామా చేశారు, అయితే ఈ ఏడాది ఫిబ్రవరి వరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. H-1B వీసా విషయంలో గొలుసు ఆధారిత వలసలను నిర్మూలించాల్సిన అవసరం అమెరికాకు ఉందనీ, దేశానికి నైపుణ్య సహకారం అందించే వలసదారుల కుటంబీకులు మాత్రం మెరిట్ ఆధారంగా రావడం లేదని అన్నారు.
అమెరికాకు చెందిన ఇమ్మిగ్రేషన్ వాయిస్ అనే స్వచ్ఛంద సంస్థ కూడా రామస్వామితో ఏకీభవించింది. సంస్థ రాసింది H1B వీసా అనేది, వీసాను స్పాన్సర్ చేసే కంపెనీకి మాత్రమే ప్రయోజనం చేకూర్చే ఇండెంచర్డ్ సర్విట్యూడ్. కానీ అది అందరికి అందడం లేదు.. H1Bని తొలగించే సమయం వచ్చిందని తాము అంగీకరిస్తున్నామని తెలిపింది.