భారత జాతీయ గీతం ‘జనగణమన’.ప్రతి భారతీయుడు ఎంతో గర్వంగా ఆలపించే ఈ గేయాన్ని.... విదేశీయులు ఆలపించారు. అమెరికన్ సైన్యం భారత జాతీయ గీతాన్ని ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే....  భారత్- అమెరికాల మధ్య రక్షణ పరమైన సమన్వయాన్ని బలోపేతం చేసే దిశగా ‘ యుధ్ అభ్యాస్ 2019’ పేరుతో సంయుక్త డ్రిల్ చేపట్టారు. ఇందులో భాగంగా గతవారం అస్సాం రెజిమెంటల్ మార్చింగ్ పాట ‘ బద్లూరామ్ కా బదన్’ పాటకు డ్యాన్స్ వేసిన అమెరికా జవాన్లు... తాజాగా మన దేశ జాతీయ గీతమైన జనగణమనను ఆలపించారు.

కాగా... అమెరికా జవాన్లు ఎంతో లయబద్ధంగా సంగీత వాయిద్యాలతో  జనగణమన ను ఆలపిస్తుండగా.. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికీ ఈ వీడియో తెగ నచ్చేస్తోంది.  ఇటీవల అమెరికా జవాన్లు ‘ బద్లూరామ్ కా బదన్’ పాటకు నర్తించగా... అది కూడా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

వాషింగ్టన్ లోని జాయింట్ బేస్ లాయూస్ మెక్ కార్డ్ వేదిగా సెప్టెంబర్ 5వ తేదీన ప్రారంభమైన యుధ్ అభ్యాస్ సెప్టెంబర్ 18వ తేదీతో ముగిసింది. ఇందులో భాగంగా ఇరు దేశాల  సైనికులు మాక్ డ్రిల్ నిర్వహించారు.